బ్రిస్బేన్: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక నాలుగోటెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ తొలివికెట్ కోల్పోయింది. 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్‌లో ఆదిలోనే తొలి వికెట్ సమర్పించుకుంది. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద రోహిత్ శర్మ(7) తొలివికెట్‌గా వెనుదిరిగాడు. కమిన్స్ బౌలింగ్‌లో రోహిత్ కీపర్‌కు చిక్కాడు. దీంతో ఓవర్‌నైట్ స్కోరు(4)కు కేవలం మూడు పరుగులు చేసి రోహిత్ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శుభమన్‌గిల్(20), పూజారా ఉన్నారు.
ఇదీ చదవండి..