గబ్బా మ్యాచ్‌పై కెప్టెన్లు ఏమన్నారంటే
ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియాపై భారత్ చారిత్రక విజయం సాధించింది. గత 32 ఏళ్లగా గబ్బాలో ఓటమెరుగని ఆసీస్‌ను మట్టికరిపించి టెస్టు సిరీస్‌ను 2-1తో సాధించింది. అయితే పోటాపోటీగా సాగిన ఈ సిరీస్ క్రికెట్ అభిమానులకు జ్ఞాపకంగా నిలిచిపోతుంది. అయితే మ్యాచ్ అనంతరం రెండు జట్ల కెప్టెన్లు సిరీస్ గురించి ఏమన్నారో వారి మాటల్లోనే..
‘‘ఈ విజయం చిరస్మరణీయం. ఎలా చెప్పాలో మాటలు రావట్లేదు. అడిలైడ్ ఓటమి తర్వాత అద్భుత ప్రదర్శనతో తామేంటో మా ఆటగాళ్లు చాటిచెప్పారు. ప్రతిఒక్కరి పాత్రను అభినందిస్తున్నా. ఎంతో తీవ్రతతో ఆడారు. ఇక ఆఖరి రోజు ఆటలో పుజారాకు క్రెడిట్ ఇవ్వాలి. ఇద్దరం చర్చించుకున్నాం. అతడు నిలకడగా ఆడితే, నేను కాస్త దూకుడుగా ఆడాలని. అయితే పుజారా ఒత్తిడిని గొప్పగా అధిగమించాడు. ఆఖర్లో పంత్, సుందర్ అద్భుతంగా ఆడారు’’
‘‘ఇక్కడ విజయం సాధించాలంటే 20 వికెట్లు సాధించాలి. అందుకే అయిదుగురు బౌలర్లతో బరిలోకి దిగాం. జడేజా స్థానాన్ని సుందర్ గొప్పగా భర్తీచేశాడు. సిరాజ్ రెండు టెస్టులు, సైని ఒక టెస్టు ఆడాడు. మా బౌలర్లకు అనుభవం లేదు. అయినా అద్భుత ప్రదర్శన చేశారు. అయితే అడిలైడ్ ఓటమి తర్వాత దాని గురించి మేం చర్చించుకోలేదు. మిగిలిన మ్యాచ్‌లపైనే దృష్టిసారించాం. ఫలితాలపై ఆలోచించకుండా పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాలనుకున్నాం’’ - అజింక్య రహానె, భారత కెప్టెన్
‘‘సిరీస్ గెలవాలని గబ్బాకు వచ్చాం. కానీ పేలవ ప్రదర్శన చేశాం. మా లోపాలపై దృష్టిసారించాల్సి ఉంది. బలమైన జట్టు అయినప్పటికీ మంచి ప్రదర్శన చేయలేకపోయాం. ఎన్నో విభాగాల్లో మెరుగవ్వాలి. 300 పరుగులు చేసి సిరీస్‌ను సాధించాలనుకున్నాం. కానీ భారత్ గొప్పగా పోరాడింది. శరీరంపైకి వస్తున్న బంతుల్ని టీమిండియా బ్యాట్స్‌మెన్ గొప్పగా ఎదుర్కొన్నారు. విజయానికి వారే పూర్తి అర్హులు. మా బౌలర్లు ప్రయత్నించినప్పటికీ టీమిండియా అద్భుత ప్రదర్శనతో సిరీస్ సాధించింది’’ -టిమ్ పైన్, ఆస్ట్రేలియా కెప్టెన్
ఇదీ చదవండి