శుక్రవారం, మే 29, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ప్రపంచకప్‌లలో నువ్వో లెజెండ్‌..

యువరాజ్‌ సింగ్‌ను ఉద్దేశించి రవిశాస్త్రి

ఇంటర్నెట్‌డెస్క్‌: 2011 ఏప్రిల్‌ 2న టీమ్‌ఇండియా వన్డేల్లో రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. గురువారం నాటికి ఆ మధుర ఘట్టానికి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నాటి ఫైనల్లో ధోనీ చివర్లో కొట్టిన విన్నింగ్‌ సిక్స్‌ వీడియోను రవిశాస్త్రి గురువారం పోస్టు చేసి.. అప్పటి జట్టు సభ్యులకు శుభాకాంక్షలు చెప్పాడు. ‘1983లో అచ్చం మాలాగే.. ఈ విజయం మీ జీవితకాలం గుర్తుండిపోతుంది’ అని నాటి ప్రపంచకప్‌ విజేతలను ఉద్దేశించి పేర్కొన్నాడు. ఆ ట్వీట్‌లో రవిశాస్త్రి.. కేవలం ఇద్దరిని మాత్రమే ట్యాగ్‌ చేశాడు. అది క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌, ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాత్రమే. 

ఇది గమనించిన 2011 ప్రపంచకప్‌ హీరో యువరాజ్‌ సింగ్‌ వెంటనే శాస్త్రికి రీట్వీట్‌ చేశాడు. ‘థాంక్స్‌ సినీయర్‌.. మీరు నన్ను, మహేంద్ర సింగ్‌ ధోనీని కూడా ట్యాగ్‌ చేయొచ్చు. మేం కూడా ఆ జట్టులో సభ్యులమే’ అని సరదాగా నవ్వుతున్న ఎమోజీ జతచేశాడు. దీనికి టీమ్‌ ఇండియా కోచ్‌ స్పందించారు. ‘ప్రపంచకప్‌ల విషయానికొస్తే నువ్వెప్పుడూ జూనియర్‌ కాదు. నువ్వో లెజెండ్‌’ అని యువీని కీర్తించాడు. యువరాజ్‌ 2007 టీ20 ప్రపంచకప్‌లో, 2011 వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి.. మాజీ ఆల్‌రౌండర్‌ను ప్రశంసించాడు. ఇక 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో ధోనీ.. కులశేఖర బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టి మ్యాచ్‌ను గెలిపించిన తీరు ఇప్పటికీ అభిమానుల కళ్లల్లో కదలాడుతుంటుంది. కాగా, ఆ సమయంలో రవిశాస్త్రి రన్నింగ్‌ కామెంట్రీ చేయడం గమనార్హం. 


కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)