మంగళవారం, జూన్ 02, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

లబుషేన్‌పై ప్రాంక్‌ వీడియో చూడండి

గతేడాది ఏప్రిల్‌ ఫూల్స్‌డే సందర్భంగా..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌ను ఏప్రిల్‌ ఫూల్‌ చేశారు ఆ జట్టు టెస్టు కెప్టెన్‌ టిమ్‌పైన్‌, కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌. గతేడాది చేసిన ఈ ప్రాంక్‌ వీడియో ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌ విడుదల చేసిన ‘ద టెస్ట్‌’ అనే డాక్యుమెంటరీలో పొందుపర్చారు. ఆ వీడియోలో లాంగర్‌, టిమ్‌పైన్‌ చేతులు కలిపి లబుషేన్‌ను సరదాగా ఆటపట్టించారు. దక్షిణాఫ్రికాకు చెందిన లబుషేన్‌ పదేళ్ల వయసులోనే ఆస్ట్రేలియాకు వలసవచ్చి ఇక్కడ క్రికెటర్‌గా ఎదిగాడు. గతేడాది ఆస్ట్రేలియా టెస్టు బ్యాట్స్‌మన్‌గా అరంగేట్రం చేసిన ఇతడిని ఏప్రిల్‌ ఫూల్స్‌ డే సందర్భంగా కెప్టెన్‌, కోచ్‌ ప్రాంక్‌ చేశారు.

లబుషేన్‌ను నీ ఆరాధ్య క్రికెటర్‌ ఎవరని అడగ్గానే‌ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాక్వెస్‌ కలిస్‌ పేరు చెప్పాడు. దీంతో లాంగర్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు నటించి అతడిని పక్కకు తీసుకెళ్లి ఇలా అన్నాడు. ‘నువ్వు సమాధానం చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆస్ట్రేలియా క్రికెటర్‌గా ఉంటూ కలిస్‌, డివిలియర్స్‌ పేర్లు చెప్పడం సరికాదు. అలా చెబితే మన ఆటగాళ్లకి నచ్చదు. వాళ్లు తేలిగ్గా తీసుకోరు’ అని హెచ్చరించినట్లు చెప్పాడు. అది నిజమేనని అనుకున్న లబుషేన్‌.. ‘సరే, అది నా ఉద్దేశం కాదు. ఇకపై ఇలాంటి ప్రశ్నలే ఎదురైతే ఏం చేయాలి?’ అని అడిగాడు. దీనికి లాంగర్‌ స్పందిస్తూ.. స్టీవ్‌స్మిత్‌ పేరు చెప్పమని చెప్పాడు. ఆ తర్వాత టిమ్‌పైన్‌, జస్టిన్ లాంగర్‌ నవ్వుకుంటూ వచ్చి కెమెరాను చూస్తూ అందరికీ ఏప్రిల్‌ ఫూల్స్‌ డే శుభాకాంక్షలు చెప్పారు. అది తనమీద చేసిన ప్రాంక్‌ అని లబుషేన్‌కు అప్పుడు అర్థం అయ్యింది.  


కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)