మంగళవారం, జూన్ 02, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన క్రికెటర్‌ పెళ్లి

జోహెనస్‌బర్గ్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఆ జట్టు మహిళా ఓపెనర్‌ లిజెల్లీ లీ వివాహం నిలిచిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి బారిన పడి రోజుకు వేల మంది మరణిస్తున్నారు. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా కరోనా బారిన పడగా 50 వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో.. వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేయడానికి అనేక దేశాలు లాక్‌డౌన్‌ పాటిస్తున్నాయి. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా కూడా 21 రోజులపాటు లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో లిజెల్లీ వివాహం నిలిచిపోయింది. 

తన ప్రియుడు తాంజా క్రోనేతో ఏప్రిల్‌ 10న లిజెల్లీ వివాహం జరగాల్సి ఉంది. లాక్‌డౌన్‌లో అది 15వ రోజుగా ఉండడంతో వివాహం నిలిచిపోయింది. దక్షిణాఫ్రికా ఓపెనర్‌ ప్రస్తుతం తన తల్లిదండ్రుల వద్ద ఎర్మెలాలో నివసిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైంది. ఒకవేళ కరోనా ప్రభావం లేకుంటే దక్షిణాఫ్రికా.. ఈపాటికి ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, మూడు టీ20 పూర్తి చేసుకునేది. లిజెల్లీ మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ జట్టు మంచి స్థితిలో ఉందని, ఎలాంటి జట్టుకూ భయపడదని స్పష్టం చేసింది. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుతో తమకు ఆడాలని ఉందని, అలాంటి జట్టును ఓడించి తమ సత్తా ఏంటో చాటాలనుకుంటున్నట్లు ఆమె వెల్లడించింది. 

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)