సోమవారం, జులై 13, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

అలాగైతే.. ఐపీఎల్‌ ఆడతా

ముంబయి: టీ20 ప్రపంచకప్‌ వాయిదాపడి ఆ స్థానంలో ఐపీఎల్‌ జరిగితే తాను కచ్చితంగా ఆడతానని ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ అన్నాడు. ఆస్ట్రేలియా ప్రభుత్వం సురక్షితమని భావించి అనుమతిస్తేనే ప్రయాణం చేస్తానని వెల్లడించాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు స్మిత్‌ సారథ్యం వహిస్తున్నాడు.

కరోనా వైరస్‌ కారణంగా ఏప్రిల్‌-మేలో జరగాల్సిన ఐపీఎల్‌-2020 వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచకప్‌ నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.

‘వన్డే, టీ20.. ఫార్మాట్‌ ఏదైనా దేశం తరఫున ప్రపంచకప్‌ ఆడటమే పరమావధి. ఒకవేళ టోర్నీ వాయిదాపడి ఐపీఎల్‌ జరిగితే అందులో ఆడతా. అదో అద్భుతమైన లీగ్‌. ప్రస్తుతం పరిస్థితులు ఎవరి నియంత్రణలోనూ లేవు. ఇక ఆటగాళ్లంతా చెప్పినట్టు చేయడమే పని. ప్రపంచకప్‌ వాయిదా పడుతుందో లేదో తెలియదు. జరిగితే గొప్ప. క్రికెట్‌కు పరిస్థితులు అనుకూలించకపోతే చేసేదేమీ లేదు. అప్పటి వరకు ప్రభుత్వం చెప్పినట్టు చేయడమే. ఇంట్లో కూర్చొని ఫిట్‌నెస్‌పై దృష్టి సారించడమే పని’ అని స్మిత్‌ అన్నాడు.

ఐసీసీ బంతిని ఉమ్మితో రుద్దడాన్ని నిషేధంచడంపై స్మిత్‌ స్పందించాడు. ‘బ్యాటు, బంతి మధ్య సరైన పోటీ ఉండాలని కోరుకొనే వ్యక్తిని నేను. ఉమ్మితో రుద్దడాన్ని నిషేధించడాన్ని సమర్థించను. ఇందుకు ప్రత్యామ్నాయం సైతం కష్టమే. బంతిపై పట్టు చిక్కేందుకు నా చేతుల్లో ఉమ్మివేసుకొని రుద్దుతాను. ఏదేమైనప్పటికీ ఇవన్నీ సర్దుకోవాలంటే కొంత సమయం పడుతుంది. దీనిపై ముందుకు వెళ్లేందుకు ఐసీసీ ఏం చేస్తుందో చూడాలి’ అని స్మిత్‌ పేర్కొన్నాడు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని