శుక్రవారం, మే 29, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

రోహిత్‌.. బుమ్రా మధ్యలో చాహల్‌

ఆర్‌సీబీ స్పిన్నర్‌పై ముంబయి ఇండియన్స్‌ ఆటగాళ్ల సెటైర్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ సందర్భంగా టీమ్‌ ఇండియా క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు. తాజాగా ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ, పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాతో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ వీడియో చాట్‌ చేశాడు. ఈ సందర్భంగా ఐపీఎల్‌ 2020 ప్రణాళికలు, టీవీ కార్యక్రమాలు, వంటలు తదితర అంశాలపై ముచ్చటించుకున్నారు. వారి చాట్‌ను వీక్షించిన యుజువేంద్ర చాహల్‌ వరుసగా కామెంట్లు చేశాడు. దాంతో రోహిత్‌.. చాహల్‌ను లైవ్‌ వీడియోలోకి అనుమతిచ్చాడు. ఈ సందర్భంగా చాహల్‌ మాట్లాడుతూ.. ‘ముంబయి ఇండియన్స్‌ తననేమైనా మిస్సవుతుందా’ అని అడిగాడు. 

ఇందుకు స్పందించిన ముంబయి క్రికెటర్లు చాహల్‌ను ఆటపట్టించారు. అతనడిగిన ప్రశ్నను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు ఫ్రాంఛైజీకి చెప్పడంతో పాటు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దృష్టికి తీసుకెళతామన్నారు. (చాహల్‌ ఆర్సీబీకి రాక ముందు 2011 నుంచి 2013 వరకు ముంబయి ఇండియన్స్‌ తరఫున ఆడటం గమనార్హం). ఈ మెసేజ్‌ ఆర్సీబీకి వెళుతుందని చాహల్‌కు చెప్పమని రోహిత్‌.. బుమ్రాతో అన్నాడు. ‘ఈ విషయాన్ని వాళ్ల కెప్టెన్‌కు కూడా చెబుతాం. దీన్ని బట్టి, చాహల్‌కు ముంబయికి తిరిగి రావాలనుకుంటున్నాడు’ అని బుమ్రా సరదాగా నవ్వాడు. అనంతరం రోహిత్‌ స్పందిస్తూ.. ‘ఒకవేళ మనం గెలవకపోతే.. చాహల్‌ను మిస్సయ్యేవాళ్లం. కానీ, మనం గెలుస్తున్నాం. అప్పుడెందుకు మిస్సవుతాం? చాహల్‌, నువ్వు బెంగుళూరులోనే ఉండు. నీకదే మంచిది’ అని రోహిత్‌ చమత్కరించాడు. 

2013లో ముంబయి ఇండియన్స్‌ తరఫున ఒకే మ్యాచ్‌ ఆడిన చాహల్‌ను.. 2014లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో 12 వికెట్లతో ఆకట్టుకోడంతో టీమ్‌ఇండియా స్పిన్నర్‌ ఆర్సీబీకి పర్మింనెంట్‌ ఆటగాడిగా మారిపోయాడు. ఆ జట్టు తరఫున 83 మ్యాచ్‌లు ఆడగా 99 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్‌ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఇది ఏప్రిల్‌ 14 వరకు కొనసాగనుంది. షెడ్యూల్‌ ప్రకారం ఐపీఎల్‌ మార్చి 29 నుంచే ప్రారంభంకావాల్సి ఉంది. కరోనా కారణంగా ఏప్రిల్‌ 15 వరకు వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సీజన్‌ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. 

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)