మంగళవారం, జూన్ 02, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

యుద్ధ ఫలితం.. ఏప్రిల్‌ 14 తర్వాత: సచిన్‌

దిల్లీ: లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత సమయం దేశానికి అత్యంత కీలకమని దిగ్గజ క్రికెటర్‌ సచిన్ తెందుల్కర్‌ అన్నాడు. కరోనాపై భారత్‌ చేసిన యుద్ధ ఫలితం ఏప్రిల్‌ 14 తర్వాత కనిపిస్తుందని అభిప్రాయపడ్డాడు. అయితే లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కూడా అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించాడు. మహమ్మారిపై చేస్తున్న పోరు నేపథ్యంలో క్రీడా ప్రముఖులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే. సచిన్‌తో సహా 40 మందికి పైగా క్రీడా ప్రముఖులతో మోదీ మాట్లాడారు. దీనిపై సచిన్‌ స్పందించాడు.

‘‘లాక్‌డౌన్‌ తర్వాత కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అది కీలక సమయం. కరచాలనం బదులుగా సామాజిక దూరం పాటిస్తూ నమస్తేతో పలకరించాలి. ప్రస్తుతం శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. దేశమంతా ఐక్యంగా ఉండాల్సిన సమయం ఇది. క్రీడలలో జట్టుగా మ్యాచ్‌ను గెలిచినట్లే.. మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడు దేశమంతా జట్టుగా పోరాడాలి. అయితే ఏప్రిల్‌ 14 తర్వాత కూడా కరోనా జాగ్రత్తలు అందరూ తప్పక పాటించాలని మోదీ కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పునరుద్ఘాటించారు. పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఈ సమయంలో వారి అనుభవాలు తెలుసుకోవాలన్నారు’’ అని సచిన్‌ తెలిపారు.

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)