శుక్రవారం, మే 29, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

క్రీడా ప్రముఖులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

అయిదు అంశాలతో సందేశాలు ఇవ్వండి: మోదీ

దిల్లీ: కరోనా వైరస్‌పై చేస్తున్న పోరాటంలో క్రీడా ప్రముఖులు మద్దతివ్వాలని, సానుకూలత సందేశాలతో ప్రజల్లో చైతన్యం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజుజుతో సహా మోదీ 49 మంది క్రీడా ప్రముఖులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కొవిడ్‌-19 మానవాళికి విరోధి అని, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒలింపిక్స్‌ వాయిదా పడిన పరిస్థితే దాన్ని తీవ్రతకు అద్దం పడుతోందని అన్నారు. మైదానంలో పోరాడి దేశానికి కీర్తి తెచ్చిన విధంగానే ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లోనూ పోరాడాలని కోరారు.

‘‘లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేయాలి. అంతేకాక వారిలో ధైర్యాన్ని పెంచుతూ, సామాజిక దూరం పాటించాలని కోరాలి. ప్రస్తుతం మీరు ప్రజలకు ఇచ్చే సందేశాలు ఎంతో కీలకం. క్రీడా శిక్షణలో మీరు నేర్చుకున్న స్వీయ క్రమశిక్షణ, సానుకూలత, ఆత్మవిశ్వాసం, సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం.. వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేయడానికి ఉపయోగించాలి. మైదానాంలో పోరాడిన తీరుతోనే మహమ్మారిని ఎదుర్కోవాలి’’ అని క్రీడాకారులతో మోదీ అన్నారు.

‘‘ప్రజలకు మీరిచ్చే సందేశాల్లో ఈ అయిదు అంశాలను చేర్చాలి. మహమ్మారిపై పోరాడాలనే ‘సంకల్పం‌’, సామాజిక దూరాన్ని అనుసరించాలనే ‘నిగ్రహం’, సానుకూలత ధోరణిలో ఉండాలనే ‘అనుకూలత’, కరోనాపై చేస్తున్న యుద్ధంలో ముందుండి పోరాడుతున్న వైద్య, పోలీసు సిబ్బంది..మొదలైన వారిపై ‘గౌరవం‌’, పీఎం-కేర్స్‌కు తమ వంతు సాయం చేసేలా ‘సహకారం‌’ అనే అంశాలు ఉండాలి. ఆయుష్ మంత్రిత్వ శాఖ జారీచేసిన మార్గదర్శకాలను పాటించేలా ప్రజలకు సూచించాలి’’ అని ప్రధాని వెల్లడించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌, సారథి విరాట్ కోహ్లీ, తెలుగు తేజం పీవీ సింధు, అథ్లెట్‌ హిమదాస్‌, భారత హాకీ మహిళల జట్టు సారథి రాణి రాంపాల్‌, కబడ్డీ ప్లేయర్‌ అజయ్‌ ఠాకూర్‌, పారా అథ్లెట్‌ శరద్‌ కుమార్, చెస్‌ దిగ్గజం విశ్వనాథ్‌ ఆనంద్‌, జావెలిన్‌ ప్లేయర్‌ నీరజ్‌ చోప్రా, బాక్సర్లు మేరీకోమ్‌, అమిత్‌ పంగాల్‌ మొదలైన వారు పాల్గొన్నారు. కరోనాపై ప్రధాని పోరాడుతున్న తీరుని ప్రశంసించారు.

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)