మంగళవారం, జూన్ 02, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

హీరోయిన్‌గా నటిస్తే థియేటర్లన్నీ ఖాళీనే: స్మృతి

ముంబయి: మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగా ఒలింపిక్స్‌తో సహా ఎన్నో టోర్నీలు రద్దయ్యాయి. దీంతో క్రీడా ప్రముఖలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబంతో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన ట్విటర్‌లో ప్రశ్న-జవాబుల సెషన్‌లో పాల్గొంది. నెటిజన్ల అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానలతో ఆకట్టుకుంది. ఎప్పుడూ మైదానంలో చక్కని షాట్లతో అలరించే స్మృతి నెట్టింట్లోనూ తన సమయస్ఫూర్తితో అదరగొట్టింది. ‘‘ప్రస్తుతం అందరం ఇంట్లోనే ఉండి సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనాపై పోరాడుతున్నాం. అభిమానులతో ముచ్చటించడానికి ఇదే సరైన సమయం. ప్రశ్న-జవాబుల సెషన్‌లో పాల్గొందాం" అని సెషన్‌ మొదలుపెట్టింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు స్మృతి ఇలా సమాధానాలు ఇచ్చింది...

* చిన్నతనంలో మీ ఫేవరేట్‌ కార్టూన్‌ ఏంటి?
నాడీ, బాబ్‌ ద బిల్డర్‌, నింజా హట్టోరి అంటే ఎంతో ఇష్టం. ఖాళీ సమయాల్లో ఇప్పటికీ చూస్తుంటాను.

* ఓపెనర్‌గా బరిలోకి దిగే ముందు దేనిపై దృష్టి పెడతారు?
సాధారణంగా ఉండటానికి ప్రయత్నిస్తా. బంతిని గమనించడం, దానికి తగ్గట్లుగా ఆడటం చేస్తా.

* క్రికెట్‌లో మీకు ఎంతో ఇష్టమైన క్షణం ఏంటి?
భారత్‌ తరఫున అరంగేట్రం చేసిన క్షణం నాకు ఎంతో ఇష్టం. అయితే, ఎప్పటికీ మరవలేని సంఘటన ఇంకా జరగలేదు. ప్రపంచకప్‌ను ముద్దాడటమే నా జీవితంలో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఏదో ఒక రోజు తప్పక కప్‌ను అందుకుంటా.

* మీ జీవిత భాగస్వామిగా ఉండటానికి కావాల్సిన అర్హతలు ఏంటి? 
రెండు అర్హతలు ఉండాలి. ఒకటి.. అతడు నన్ను ఎంతో ప్రేమించాలి. రెండు.. ఒకటిని తప్పక పాటించాలి.

* పెద్దల కుదిర్చిన వివాహం ఇష్టమా? లేదా ప్రేమ వివాహమా?
లవ్‌-అరెంజ్డ్‌.

* అలారమ్‌ అంటే మీకు ఇష్టమా?
ఇష్టపడటానికి ప్రయత్నిస్తున్నా. కానీ నిద్రకు భంగం కలిగించేది ఏదీ నాకు ఇష్టం ఉండదు.

* మీరు ఎంతో అందంగా ఉంటారు. హీరోయిన్‌గా నటిస్తారా? మిమ్మల్ని సినిమాల్లో చూడొచ్చా?
నేను నటిస్తే.. ఆ సినిమాని చూడటానికి థియేటర్లకు ఎవరూ రారు. మీరు అలాంటివి ఆశించకండి.

* ఎంతో కాలం తర్వాత మీ కుంటుంబతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. దీనిపై మీ ఫ్యామిలీ స్పందన ఏంటి?
నా మొహం చూసి చూసి వారికి విసుగొచ్చింది. తర్వాత సిరీస్‌ కోసం నేను ఎప్పుడూ వెళ్తానా అని ఎదురుచూస్తున్నారు. హహ్హాహ్హా.. సరదాగా అన్నాను. ఈ సమయాన్ని అందరం ఎంతో ఆస్వాదిస్తున్నాం.

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)