సోమవారం, జులై 13, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

కేవలం డబ్బు కోసమే కాదు!

ముంబయి: కేవలం డబ్బు కోసమే విదేశీ లీగుల్లోకి అనుమతి కోరడం లేదని టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ సురేశ్‌ రైనా అన్నాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో నాణ్యత కొరవడిందని పేర్కొన్నాడు. అందులో ఆడితే మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించడం లేదని వెల్లడించాడు.

బీసీసీఐ కాంట్రాక్టుయేతర క్రికెటర్లకు విదేశీ టీ20 లీగుల్లో ఆడేందుకు బోర్డు అనుమతి ఇవ్వాలని రైనా ఈ మధ్యే కోరాడు. అక్కడ అనుభవంతో పాటు వైవిధ్యం దొరుకుతుందని పేర్కొన్నాడు. రాబిన్‌ ఉతప్ప, ఇర్ఫాన్‌ పఠాన్‌ వంటి క్రికెటర్లు సైతం అతడికి మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం వీడ్కోలు పలికిన వారికి తప్ప విదేశీ లీగుల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వని సంగతి తెలిసిందే.

‘డబ్బుల కోసం కాదు. ఐపీఎల్‌లో వస్తున్నంత డబ్బు మరెక్కడా దొరకదు. విదేశీ లీగుల్లో పదేళ్లు ఆడినా అంత సంపాదించలేం. ఐపీఎల్‌ సీజన్‌ ముగిశాక బీసీసీఐ కాంట్రాక్టు పొందని వెటరన్‌ క్రికెటర్లకు మరో అవకాశం ఇవ్వాలి. ఏడాదికి ఒకటో రెండో లీగులు ఆడాలనుకుంటున్నాం. కేవలం ఆడేందుకే. ప్రస్తుతం రంజీ ట్రోఫీ నాణ్యత అంతగా లేదు’ అని రైనా అన్నాడు.

‘మాకు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ అవసరం. ఇంటివద్దే రెండు నెలలు కూర్చొని దేశవాళీ క్రికెట్‌ ఆడితే ఆత్మవిశ్వాసం లభించడం లేదు. మేం నాణ్యమైన క్రికెట్‌ ఆడాలనుకుంటున్నాం. నేను డబ్బు కోసం ఆడటం లేదు. నాకున్న దాంతో నేనిప్పుడు సంతోషంగానే ఉన్నాను’ అని రైనా పేర్కొన్నాడు. తన బాల్యం (1998)లో సచిన్‌ తెందూల్కర్‌ బ్యాటింగ్‌ చూసేందుకు బడి ఎగ్గొట్టిన సంగతిని అతడు గుర్తుచేసుకున్నాడు. ట్రైసిరీస్‌లో భాగంగా షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో సచిన్‌ 131 బంతుల్లో 143 పరుగులు చేసి జట్టుకు విజయం అందించాడని పేర్కొన్నాడు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని