మంగళవారం, జూన్ 02, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ముందు ప్రాణాలు.. తర్వాత ఐపీఎల్: రైనా

దిల్లీ: కరోనా వైరస్‌ను అరికట్టే వరకూ ఐపీఎల్‌ నిర్వహించడం సాధ్యం కాదని టీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా అభిప్రాయపడ్డాడు. మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంటున్న నేపథ్యంలో ఐపీఎల్‌ కోసం అభిమానులు మరికొన్ని రోజులు వేచి చూడాలని అన్నాడు. ‘‘జీవితం ఎంతో ముఖ్యం. ఐపీఎల్‌కు ఇంకా సమయం ఉంది. లాక్‌డౌన్‌లో ప్రభుత్వ సూచనలను అందరూ పాటించాలి. ముందు జీవితం బాగుండాలి. తర్వాత ఐపీఎల్‌ గురించి ఆలోచిద్దాం. ప్రస్తుతం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మనం ప్రాణాల్ని కాపాడుకోవాలి’’ అని రైనా తెలిపాడు.

‘‘లాక్‌డౌన్‌తో ఎన్నో విషయాలు అర్థమయ్యాయి. క్రికెట్‌ కంటే జీవితంలో గొప్ప క్షణాలు ఎన్నో ఉన్నాయి. పిల్లలతో సమయాన్ని గడుపుతున్నాను, వంట చేస్తున్నాను. ప్రస్తుతం ఖరీదైన కార్లు, బంగ్లాలు, నువ్వు ధరించే దుస్తులు కంటే మూడు పూటల భోజనం ముఖ్యం. లాక్‌డౌన్‌లో ప్రజలంతా వాస్తవాన్ని తప్పక తెలుసుకుంటారు’’ అని అన్నాడు.

ఈ ఏడాది సీజన్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి ధోనీతో కలిసి రైనా మార్చి నుంచే సాధన మొదలుపెట్టాడు. కానీ, మహమ్మారి కారణంగా ఐపీఎల్‌ను ఏప్రిల్‌ 15వరకు వాయిదా వేశారు. దీంతో ప్రాక్టీస్‌ను కూడా ఆపేశారు. ‘‘శిక్షణ గొప్పగా సాగింది. కానీ మహమ్మారి కారణంగా ఆగిపోయింది. శిక్షణలో ధోనీతో కలిసి ప్రాక్టీస్‌ చేశాను. నెట్స్‌లో అతడు అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. యువకుడిలా చెలరేగుతున్నాడు. ఒక సెషన్‌లో అతడు విరామం లేకుండా మూడు గంటలు బ్యాటింగ్‌ చేశాడు’’ అని రైనా తెలిపాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే జట్టుకు రైనా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)