మంగళవారం, జూన్ 02, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఇంట్లో చేయండి.. వీధుల్లో ప్రదర్శన వద్దు

కరోనా కట్టడికి కొత్త శక్తిని సృష్టిద్దాం: రవిశాస్త్రి

ముంబయి: కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి భారతీయులంతా ఏకమవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపును స్వాగతించారు టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి, సీనియర్‌ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌. ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు.. 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పివేసి కొవ్వొత్తులు, టార్చ్‌, సెల్‌ఫోన్‌ లైట్లు, ప్రమిదలు వెలిగించాలని శుక్రవారం ఉదయం దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన రవిశాస్త్రి.. 130 కోట్ల మంది భారతీయుల బలం మరోసారి చాటాలని పేర్కొన్నారు. మోదీ చెప్పినట్లు చేసి కరోనా వైరస్‌పై పోరాటానికి కొత్త శక్తిని సృష్టిద్దామని ట్వీట్‌ చేశాడు. 

ఇదే విషయమై హర్భజన్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘అందరూ ఇళ్లల్లో ఉండడంలో ప్రతీ ఒక్కరి పాత్ర ఉంది. మన జాతీయ నేత నరేంద్రమోదీ పట్ల గర్వంగా ఉంది. అందరం ఇలాగే ఇళ్లల్లోనే ఉంటూ జాగ్రత్తగా ఉందాం. ఏప్రిల్‌ 5న రాత్రి 9 గంటలకు.. 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పేసి టార్చ్‌, కొవ్వొత్తులు, దీపాలు, సెల్‌ఫోన్‌ లైట్లతో వెలుగులు నింపుదాం. అది కూడా ఇంట్లో ఉండి మాత్రమే. దయచేసి వీధుల్లో ప్రదర్శన చేయకండి’ అని హర్భజన్‌ పేర్కొన్నాడు.

మార్చి 22న మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూకు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసందే. అనంతరం సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టే సమయంలో పలు ప్రాంతాల వాసులు బయట రోడ్లపై ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి పొరపాట్లు చేయకండని భజ్జీ విజ్ఞప్తి చేశాడు. 

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)