శుక్రవారం, మే 29, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

మీరు ఆ సిక్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు

2011 ప్రపంచకప్‌పై గంభీర్‌ ట్వీట్‌.. 

దిల్లీ: 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా.. శ్రీలంకను చిత్తుచేసి చారిత్రక విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. చివర్లో ధోనీ సిక్స్‌ కొట్టి 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. దాంతో భారత్‌ వన్డేల్లో రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆ ప్రపంచకప్‌లో భారత జట్టులోని ప్రతీ ఒక్కరూ విశేషంగా రాణించారు. యువరాజ్‌ కీలక మ్యాచ్‌ల్లో వికెట్లు తీయడంతో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. సచిన్‌ తెందూల్కర్‌ సెమీఫైనల్లో పాక్‌పై అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. జహీర్‌ ఖాన్‌ తన అనుభవంతో బౌలింగ్‌ త్రయాన్ని ముందుండి నడిపించాడు. సురేశ్‌ రైనా సైతం పలు కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక ఫైనల్లో గౌతమ్‌ గంభీర్‌, నాటి సారథి ధోనీ బాధ్యతాయుతంగా ఆడి జట్టును గెలిపించారు. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా విజయానికి ప్రతీ ఒక్కరూ తమవంతు కృషి చేశారు. 

భారత్‌ చిరస్మరణీయ విజయం సాధించి నేటికి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్‌ఫో నాటి విజయాన్ని గుర్తుచేస్తూ ఓ ట్వీట్‌ చేసింది. అందులో ధోనీ చివర్లో విన్నింగ్‌ సిక్స్‌ కొట్టిన ఫొటోను జతచేస్తూ.. ‘2011లో ఇదే రోజు.. ఆ షాట్‌ లక్షల మందిని ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది’ అని పేర్కొంది. దీనికి స్పందించిన గౌతమ్‌గంభీర్‌ ‘ఈఎస్‌పీఎన్‌ మీకో విషయం గుర్తు చేస్తున్నా.. 2011 ప్రపంచకప్‌లో యావత్‌ భారత దేశం గెలిచింది. టీమ్‌ ఇండియాతో పాటు సహాయక సిబ్బంది గెలిచారు. మీరు మాత్రం ఆ సిక్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు’ అని తనదైన శైలిలో స్పందించారు. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో గంభీర్‌ 97 పరుగులు చేయగా ధోనీ 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)