సోమవారం, జులై 13, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

#DhoniRetires ట్వీట్‌పై సాక్షి స్పష్టత

ఆమె ఎందుకు డిలీట్‌ చేశారంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై చాలాకాలం నుంచే సామాజిక మాధ్యమాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల కూడా #DhoniRetires అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిన సంగతి తెలిసిందే. అదే రోజు ఈ విషయంపై ధోని సతీమణి సాక్షి ట్విటర్‌లో స్పందించారు. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. లాక్‌డౌన్‌.. ప్రజల మానసిక పరిస్థితిని మార్చేసిందని తీవ్రంగా వ్యాఖ్యానించారు. అయితే, ఆ ట్వీట్‌ చేసిన కొద్దిసేపటికే ఆమె దాన్ని డిలీట్‌ చేశారు. దీంతో సాక్షి ఎందుకలా చేశారనే సందేహాలు వ్యక్తమయ్యాయి. 

కాగా, సాక్షి ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌ అధికారిక ఇన్‌స్టా లైవ్‌చాట్‌లో రూపా రమణి అనే మహిళతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె ధోనీ రిటైర్మెంట్‌పై చేసిన ట్వీట్‌ను ఎలాంటి పరిస్థితుల్లో తొలగించాల్సి వచ్చిందో చెప్పారు. ‘‘ఆరోజు నాకు ఓ స్నేహితురాలు మెసేజ్‌ చేసి.. ఏం జరుగుతోందని అడిగింది, మధ్యాహ్నం నుంచి #DhoniRetires అనే హ్యాష్‌ట్యాగ్‌‌ ట్రెండింగ్‌లో ఉందని చెప్పింది. దాంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అవన్నీ పుకార్లని ట్వీట్‌ చేశా. తర్వాత దాన్ని డిలీట్‌ చేశా. ఏదేమైనా నేను చెప్పాలనుకుంది చెప్పేశా. నా పని అయిపోయింది. సందేశం బయటకు తెలిసింది’ అని సాక్షి వివరించారు. అలాగే లాక్‌డౌన్ వేళ ధోనీ ఇంట్లో ఏం చేశాడనే విషయాన్ని సాక్షి వెల్లడించారు. ఆ సమయంలో మహీ ఏడు పాత బైకులకు కొత్త పరికరాలు అమర్చాడని సాక్షి చెప్పుకొచ్చారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని