మంగళవారం, జూన్ 02, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

కోహ్లీ లైవ్‌చాట్‌ను అడ్డుకున్న అనుష్కశర్మ

ఐపీఎల్‌ విజేతగా నిలవడానికి ఆర్సీబీ అర్హమైన జట్టే..

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాడు. ప్రమాదకర వైరస్‌పై ఎప్పటికప్పుడు అభిమానులకు అవగాహన కల్పిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల పీఎం కేర్స్‌కు విరాళం అందజేయనున్నట్లు ప్రకటించాడు. తాజాగా గురువారం రాత్రి ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌తో లైవ్‌లో ముచ్చటించిన సందర్భంగా ఇద్దరి మధ్య అనేక విషయాలు చర్చకు వచ్చాయి. కోహ్లీ మాట్లాడుతూ తాను మాంసాహారానికి ఎందుకు దూరమయ్యాననే విషయాన్ని వెల్లడించడంతో పాటు అనేక విషయాలను పీటర్సన్‌తో పంచుకున్నాడు. వీరిమధ్య సంభాషణ చాలాసేపు కొనసాగేసరికి కోహ్లీ సతీమణి అనుష్కశర్మ జోక్యం చేసుకొని సరదాగా అడ్డుచెప్పింది. 

చలో చలో డిన్నర్‌ టైమ్‌ అంటూ నవ్వుతున్న ఎమోజీని జతచేసి లైవ్‌చాట్‌లో కామెంట్‌ పెట్టింది. దాన్ని స్క్రీన్‌షాట్‌ తీసిన పీటర్సన్‌ అభిమానులతో పంచుకున్నాడు. అనంతరం అనుష్క నిద్రపోయేముందు కోహ్లీతో సరదాగా ఇన్‌స్టాగ్రామ్‌ ఫిల్టర్స్‌తో తీసుకున్న ఫొటోలను స్టోరీస్‌లో పోస్టు చేసింది. ఇదిలా ఉండగా కోహ్లీ.. పీటర్సన్‌తో మాట్లాడేటప్పుడు ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు(ఆర్సీబీ) ఒక్కసారి కూడా విజేతగా నిలవకపోవడంపై స్పందించాడు. తమ జట్టు మూడుసార్లు ఫైనల్‌ చేరినా కప్పు గెలవలేకపోయిందని, ఆర్సీబీ కచ్చితంగా కప్పు సాధించడానికి అర్హమైన జట్టని కోహ్లీ పేర్కొన్నాడు. విజయం గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే అది అంత దూరం పారిపోతుందని వ్యాఖ్యానించాడు. దానివల్ల అనవసర ఒత్తిడి తప్ప ఉపయోగం లేదని, ఆటను ఆస్వాదించాలని చెప్పాడు. 

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)