సోమవారం, జులై 13, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

3 చక్రాల స్కూటర్‌ ఎప్పుడొస్తుంది?

ఆనంద్‌ మహింద్రా ట్వీట్‌

ముంబయి: భారత్‌కు మూడు చక్రాల స్కూటర్‌ అవసరమని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా భావిస్తున్నారు. ఈ వాహనాలు గస్తీ పోలీసులకు మరింత ఉపయోగపడతాయని పేర్కొన్నారు. తక్కువ ధరలో అందించే వేరియెంట్‌ గురించి ప్రశ్నించారు.

మహింద్రా ఫ్రెంచ్‌ సబ్సిడరీ కంపెనీ ప్యూజియోట్‌ మెట్రోపొలిస్‌ 3డబ్ల్యూ స్కూటర్‌ను చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ పోలీస్‌ స్వాట్‌ బృందాలకు అందించింది. ఈ విషయాన్ని మహీంద్రా టూవీలర్స్‌ సీఈవో ప్రకాశ్‌ వాకన్‌కర్‌ ట్విటర్‌ ద్వారా ధ్రువీకరించారు. పోలీసులు సాధన చేస్తున్న వీడియోలను జత చేశారు. దీనిపై ఆనంద్‌ మహీంద్రా వెంటనే స్పందించారు.

‘ప్యూజియోట్‌ మోటార్‌సైకిల్స్‌ వారి మెట్రోపోలీసు బైకంటే నాకెంతో ఇష్టం. గస్తీ బృందాలకు ఇవెంతో అనువుగా ఉంటాయి. ఇప్పుడివి సొంత దేశం ఫ్రాన్స్‌‌ బృందాలకూ అవసరమే. ఇమ్మాన్యుయ్యేల్‌ మేక్రాన్‌ మీరేమంటారు? తక్కువ ధరలో భారత్‌కు అనువైన వేరియంట్‌ సంగతేంటి ప్రకాశ్‌?’ అని  ట్వీట్‌ చేశారు. ఈ వాహనంలో 400 సీసీ పవర్‌ మోషన్‌ ఎల్‌ఎఫ్‌ఈ ఇంజిన్‌ ఉండటం గమనార్హం.

 


మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని