న్యాయ నేస్తం

Published : 23/10/2020 01:34 IST
మదుపులో సామాజిక బాధ్యత..

మనదేశంలోని పాత మ్యూచువల్‌ ఫండ్ల సంస్థల్లో ఒకటైన క్వాంట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ‘క్వాంట్‌ ఈఎస్‌జీ ఈక్విటీ ఫండ్‌’ అనే పేరుతో ఒక కొత్త ఫండ్‌ పథ]కాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ఈ నెల 30న ఎన్‌ఎఫ్‌ఓ ముగుస్తుంది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌ కాబట్టి ఆ తర్వాత యూనిట్ల క్రయ-విక్రయాలు ప్రారంభమవుతాయి.
ఇది ఈఎస్‌జీ ఫండ్‌ అయినప్పటికీ ఒక రకంగా చూస్తే... లార్జ్‌ క్యాప్‌ తరగతికి చెందిన పథకమే అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈఎస్‌జీ తరగతికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి మదుపరులకు దీర్ఘకాలంలో లాభాలు ఆర్జించటం ఈ పథకం ప్రధానోద్దేశం. పెట్టుబడి కోసం ఈఎస్‌జీ విభాగంలోని కంపెనీలను ‘బాటమ్‌-అప్‌’ పద్ధతిలో పరిశీలించి ఎంపిక చేస్తారు. అంతర్జాతీయ కంపెనీల్లోనూ పెట్టుబడి పెట్టే అవకాశం ఈ ఫండ్‌కు ఉంది.
క్వాంట్‌ ఈఎస్‌జీ ఫండ్‌కు అంకింత్‌ పాండే (ఈక్విటీ), సంజీవ్‌ శర్మ (డెట్‌), వావస్‌ సహగల్‌ (ఇంటర్నేషనల్‌ ఈక్విటీస్‌) ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. ఈఎస్‌జీ (ఎన్విరాన్‌మెంట్‌, సోషల్‌ అండ్‌ గవర్నెన్స్‌) పెట్టుబడుల విధానం యూఎస్‌, ఐరోపా దేశాల్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. కానీ మనదేశంలో ఈ మధ్యనే ఈ పద్ధతికి ఆదరణ పెరుగుతోంది. పర్యావరణానికి హాని చేయని, అన్ని రకాలైన నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటిస్తూ సామాజిక బాధ్యతతో వ్యవహరించే కంపెనీల్లోనే పెట్టుబడులు పెట్టటాన్ని ‘ఈఎస్‌జీ ఇన్వెస్టింగ్‌’ అంటారు. మనదేశంలో ఈఎస్‌జీ ఫండ్లు ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నాయి. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో ప్రస్తుతం ఈఎస్‌జీ ఫండ్ల వాటా 1% కంటే తక్కువే. ఈ ఫండ్లు కూడా గత ఏడాది కాలంలో నిఫ్టీ-50 కంటే తక్కువ ప్రతిఫలాన్ని మదుపరులకు అందించాయి. కానీ పెట్టుబడుల విషయంలో సామాజిక బాధ్యత కలిగి ఉండాలని భావించే మదుపరులు ఇటువంటి ఫండ్లలో పెట్టుబడుల వైపు మొగ్గుచూపవచ్చు. కాకపోతే పెట్టుబడులపై దీర్ఘకాలం పాటు ఎదురుచూస్తేనే ఎంతో కొంత ప్రతిఫలం కనిపిస్తుందని గుర్తుంచుకోవాలి.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని