మార్కెట్ సూచీలకు సరిసమానంగా పెట్టుబడి వృద్ధి చెందాలని భావించే వారికి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు సరిపోతాయి. ఈ విభాగంలో కొత్త ఫండ్‌ను టాటా మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. దీని పేరు టాటా నిఫ్టీ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఈ ఓపెన్ ఎండెడ్ పథకం నిఫ్టీ50 సూచీలోని షేర్లలో మదుపు చేస్తుంది. కనీస పెట్టుబడి రూ.5వేలు. డిసెంబరు 31 వరకూ మదుపు చేసేందుకు వీలుంది.
* ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఈక్విటీ ఆధారిత పొదుపు పథకంలో మదుపు చేయాలని అనుకునే వారికి శ్రీరామ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అందుబాటులోకి వచ్చింది. ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల్లో వైవిధ్యంగా మదుపు చేసే పథకం ఇది. ఈ ఓపెన్ ఎండెడ్ పథకంలో కనీస పెట్టుబడి రూ.500. ఆ తర్వాత రూ.500 చొప్పున పెట్టుబడిని పెంచుకునే వీలుంది. ఎన్ఎఫ్ఓలో జనవరి 18, 2019 వరకూ పెట్టుబడి పెట్టవచ్చు.
* వడ్డీ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో స్వల్పకాలం పాటు డబ్బును పెట్టుబడి పెట్టాలనుకునే వారికోసం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్, సిరీస్ 84 మార్కెట్లోకి వచ్చింది. ఇది ఇన్‌కం విభాగానికి చెందిన క్లోజ్ ఎండెడ్ ఫథకం. కనీస పెట్టుబడి రూ.5,000. డిసెంబరు 26 వరకూ మదుపు చేయొచ్చు. పెట్టిన పెట్టుబడిని కనీసం 169 రోజులు కొనసాగించాలి.