మా నాన్న గారి వయసు 61 ఏళ్లు. ఆయన పేరు మీద రూ.8 లక్షలున్నాయి. ఈ మొత్తాన్ని మెరుగైన వడ్డీ వచ్చేలా
- చక్రవర్తి
మీ నాన్నగారి వయసు 61 ఏళ్లు కాబట్టి, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లకన్నా అధిక రాబడి కోసం పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ స్కీంను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం దీనిలో 8.7 శాతం వార్షిక వడ్డీ వస్తోంది. దీనిలో మీకు 3 నెలలకోసారి వడ్డీ చెల్లిస్తారు. రూ.8 లక్షలకు మూడు నెలలకోసారి రూ.17,400 వడ్డీ వస్తుంది. 11 శాతం రాబడి రావాలంటే.. మీ పెట్టుబడిలో 50 శాతం మేరకు నష్టభయం ఉన్న పథకాల్లో మదుపు చేయాల్సిన అవసరం ఉంటుంది. కచ్చితంగా 11శాతం రాబడి వస్తుందని చెప్పలేం. వీటిపై వచ్చే డబ్బులపైనే ఖర్చులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీంను ఎంచుకోవడమే మంచిది.