Updated : 29/01/2021 06:17 IST
రిటర్నులు దాఖలు చేశారా?

త ఆర్థిక సంవత్సరం అంటే.. 2019-20 (అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2020-21)కి సంబంధించిన రిటర్నులను దాఖలు చేయడానికి జనవరి 10తో గడువు ముగిసింది. సాధారణంగా ఏటా ఇది జులై 31 వరకే ఉంటుంది. కానీ, కొవిడ్‌ నేపథ్యంలో ఈసారి ఈ తేదీని పొడిగించారు. అయితే, ఇప్పటికీ చాలామంది రిటర్నులను దాఖలు చేయలేదు. ఇలాంటి వారికి మరో చివరి అవకాశం మార్చి 31, 2021 వరకూ ఉంటుంది. కాకపోతే సెక్షన్‌ 234ఎఫ్‌ కింద కొంత జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఇది రూ.10వేల వరకూ ఉంటుంది. దీంతోపాటు అదనంగా సెక్షన్‌ 234ఎ, 234బి ప్రకారం వడ్డీ విధించే అవకాశమూ ఉంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. గడువు దాటిన తర్వాత అంటే జనవరి 10 తర్వాత దాఖలు చేసిన రిటర్నులలో నష్టాలను తదుపరి సంవత్సరానికి బదిలీ చేసుకునే వీలుండదు. కేవలం ఇంటి రుణం వడ్డీని మాత్రమే క్లెయిం చేసుకునే అవకాశం ఉంటుంది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని