Updated : 29/01/2021 06:19 IST
నాలుగు రకాల పెట్టుబడి..

నిప్పన్‌ ఇండియా మ్యూచవల్‌ ఫండ్‌ నుంచి ఒక ఆసక్తికరమైన పథకం వచ్చింది. ‘నిప్పన్‌ ఇండియా అసెట్‌ అలకేషన్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఫిబ్రవరి 1 వరకూ అందుబాటులో ఉంది. కనీస పెట్టుబడి రూ.5,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం కాబట్టి, ఆ తర్వాత యూనిట్ల క్రయవిక్రయాలకు అవకాశం ఉంటుంది.
దీని కింద సమీకరించే నిధులను నిప్పన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌కు చెందిన ఈక్విటీ, డెట్‌, గోల్డ్‌ ఈటీఎఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల యూనిట్లలో పెట్టుబడి పెడతారు. తద్వారా ఇన్టెస్టర్లకు అధిక లాభాలు తెచ్చిపెట్టాలనేది ‘నిప్పన్‌ ఇండియా అసెట్‌ అలకేషన్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’  ప్రధానోద్దేశం. క్రిసిల్‌ హైబ్రీడ్‌ 50 + 50- మోడరేట్‌ ఇండెక్స్‌ ఫండ్‌తో దీని పనితీరును పోల్చి చూస్తారు. ఫండ్‌ మేనేజర్లుగా ప్రశాంత్‌ పింపుల్‌, అశుతోష్‌ భార్గవ వ్యవహరిస్తారు.
సాధారణంగా ఒక విభాగానికే చెందిన పథకాల్లో మదుపు చేస్తే నష్టభయం అధికంగా ఉండటంతో పాటు, గరిష్ఠ లాభార్జన సాధ్యం కాకపోవచ్చు. దీనికి బదులు రెండు మూడు రకాలైన వివిధ రకాలైన పెట్టుబడి విభాగాల్లో (అసెట్‌ క్లాసెస్‌) పెట్టుబడులు పెడితే మదుపరులకు అధిక ప్రయోజనం ఉండవచ్చు. ఈ దిశగా నాలుగైదు రకాలైన మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను ఎంచుకోవాలని చూసే మదుపరులకు ఈ ఫండ్‌ ఆసక్తికరమైనదని చెప్పవచ్చు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని