☰
శనివారం, ఏప్రిల్ 10, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

సంపాదకీయం

Published : 08/04/2021 00:50 IST
వ్యూహాత్మక మైత్రే రక్షాకవచం!

దిల్లీకి క్రెమ్లిన్‌లో అత్యంత ఆప్తమిత్రుణ్ని తానేనని వ్లాదిమిర్‌ పుతిన్‌ గతంలో ఘనంగా చాటారు. బదులుగా ప్రధాని నరేంద్ర మోదీ ‘భారత్‌కు రష్యా గొప్ప మిత్ర దేశమని ఇండియాలో చిన్నపిల్లవాణ్ని అడిగినా చెబుతా’డని ప్రతిస్పందించారు. కాలపరీక్షకు నిలిచి గెలిచిన పటిష్ఠ బంధం తమదని ఇరుదేశాల నాయకగణం పదేపదే ఉద్ఘాటించిన రోజులతో పోలిస్తే- కొన్నాళ్లుగా దృశ్యంలో మార్పు కనిపిస్తోంది. ఆమధ్య అమెరికాకు ఇండియా చేరువవుతోందని అనుమానించి ఇస్లామాబాద్‌ వైపు మాస్కో కొంత మొగ్గు చూపింది. ఇంచుమించు ఆ సమయంలోనే రష్యా నుంచి తనకందిన రక్షణ పరికరాల్లాంటివే చైనాకు చేరుతుండటం భారత్‌ను కలవరపాటుకు గురిచేసింది. ఆ బాణీకి కొనసాగింపుగా, ఇటీవల అఫ్గాన్‌ శాంతి చర్చల్లో భారత్‌కు ప్రమేయం లేకుండా రష్యా దారులు మూసేసిందన్న వార్తాకథనాలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. గత డిసెంబరులో భారత్‌-రష్యా అధినేతల మధ్య జరగాల్సిన శిఖరాగ్ర సదస్సు కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా రద్దయినా, తెరవెనక కారణాలు వేరేనన్న విశ్లేషణలూ వినవచ్చాయి. ఈ ఏడాది చివర్లో పుతిన్‌-మోదీల భేటీకి సన్నాహకాల్లో భాగంగా ఇరుదేశాల విదేశాంగ శాఖామాత్యుల తాజా సమావేశం, ఎన్నో ప్రశ్నలకు ఏకకాలంలో సమాధానాలు ఇచ్చినట్లయింది. ప్రపంచంలోనే ఎన్నదగ్గ మేటి క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్‌-400 కొనుగోలు ఒప్పందంపై ముందడుగు వేస్తే ఇండియాపై ఆంక్షల విధింపు తప్పదన్న అమెరికా హెచ్చరికల్ని మంత్రుల సదస్సు పట్టించుకోలేదు. సైనిక సహకారంపై రెండు దేశాల రక్షణ మంత్రులు లోతుగా చర్చిస్తారన్న జైశంకర్‌, సెర్గీ లవ్రుఫ్‌ల ద్వయం- భిన్నరంగాల్లో ఇచ్చి పుచ్చుకోవడాలపై దృష్టి కేంద్రీకరించినట్లు సంయుక్త ప్రకటన పాఠం వెల్లడిస్తోంది. మైత్రీలతలు విరబూయించే సమష్టి కృషి కచ్చితంగా ఉభయతారకమవుతుంది!

సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నానికి మునుపు దశాబ్దాల తరబడి భారత రక్షణావసరాలకు మాస్కోయే పెద్ద దిక్కుగా భాసిల్లింది. అనంతర కాలంలో పుతిన్‌ సౌహార్దం కొనసాగినా, కొన్ని విభేదాలూ పైకి తేలాయి. అణు, రక్షణ, ఇంధన రంగాల్లో సమధిక తోడ్పాటును అభిలషించిన ఇండియాను కొన్ని షరతులు, స్వీయ ప్రాథమ్యాల ప్రాతిపదికన రష్యా ఇరకాటంలోకి నెట్టిన సందర్భాలూ ఉన్నాయి. భారత్‌ నిర్వహించిన యుద్ధ విమానాల వేలంపాటలో తమ దేశానికి చెందిన ‘మిగ్‌’ నెగ్గకపోయేసరికి అణు రియాక్టర్ల సరఫరా విధివిధానాలు మార్చాలని మాస్కో పట్టుపట్టింది! ఒకటిన్నర పుష్కరాల క్రితం ఇండియా, చైనా, రష్యాల త్రైపాక్షిక కూటమి భావనకు గట్టిగా ఓటేసిన పుతిన్‌ కొన్నాళ్లుగా బీజింగ్‌తో చెట్టపట్టాలు పట్టి సాగడం తెలిసిందే. చైనా ఆర్థిక ప్రాబల్యాన్ని, రష్యా సైనిక శక్తిని నియంత్రించడానికి ఉద్దేశించిన అమెరికా విధానాలు- పుతిన్‌, జిన్‌పింగ్‌లను పరస్పరం చేరువ చేశాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దుందుడుకు పోకడలు చుట్టుపక్కల దేశాలన్నింటినీ తీవ్ర అసహనానికి గురి చేస్తుండగా, రష్యా ఆ అంశాన్నే పట్టించుకోవడం లేదు. చైనా ముప్పుగా మారడంవల్లే ‘క్వాడ్‌’ (భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాల కూటమి)లో చేరికకు ఇండియా సుముఖమైతే- అమెరికా తంత్రంలో దిల్లీ పావుగా మారిందని మాస్కో తలపోయడం... ఒకప్పటి ప్రగాఢ మిత్ర దేశాల నడుమ పెరిగిన మానసిక దూరాన్ని ప్రస్ఫుటీకరిస్తోంది. అది అలాగే కొనసాగినా, ఇనుమడించినా- చైనాకు పట్టపగ్గాలుండవు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సొంత అజెండాలకు అనుగుణంగా రష్యా, అమెరికా పావులు కదుపుతున్నాయి. ఒక దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నామంటే ఇంకో దేశానికి దూరం జరుగుతున్నట్లు కానేకాదని తన దౌత్య పథ ప్రస్థానగతిని భారత్‌ రెండు దశాబ్దాల క్రితమే ఆవిష్కరించింది. అమెరికా, రష్యాలతో సమాన ఫాయాలో నెయ్యం, వాణిజ్యం నెరపుతూనే   చైనా మేరమీరకుండా కాచుకొనే పరీక్షలో నెగ్గుకొచ్చేలా- భారత దౌత్య ప్రజ్ఞ పదునుతేలాలి. అదే దీర్ఘకాలికంగా దేశానికి రక్షాకవచమవుతుంది!

Tags:

సంపాదకీయం

  • మాదక మహోత్పాతం

    భారత్‌, పాకిస్థాన్ల మధ్య దౌత్య సంబంధాల సాధారణీకరణకు తనవంతుగా దిల్లీ చేయాల్సింది ఎంతో ఉందంటూ ఓ పక్క ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ బడాయి...
  • తరువాయి

ప్రధాన వ్యాఖ్యానం

  • ప్రైవేటీకరణపై తగని అత్యుత్సాహం

    ప్రైవేటు రంగ సంస్థలు తమ సంస్థాపకులకు, వాటాదారులకు లాభాలు ఆర్జించిపెట్టడమే పరమావధిగా వ్యాపారం చేస్తుంటాయి. అదే ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌ఈ) అన్ని వర్గాల ప్రజలకు సరిసమానంగా సేవలు అందించడమే పరమార్థంగా కార్యకలాపాలు సాగిస్తాయి. ప్రైవేటుది...
  • తరువాయి

ఉప వ్యాఖ్యానం

  • నగర జీవికి నీటి వెతలు

    విశ్వవ్యాప్తంగా నగరాల్లో నీటి సంక్షోభం ముంచుకొస్తోంది. భూగర్భ జలం పూర్తిగా అడుగంటిపోయే- ‘డేజీరో’ ముప్పు పొంచి ఉండటమే ఇందుకు కారణం. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న నగరాల్లో భారత్‌కు చెందినవే 30 దాకా ఉన్నాయి. నీతిఆయోగ్‌ ఇటీవల విడుదల చేసిన...
  • మూలానికి మందు

    హోమియో వైద్యవిధానంలో తక్షణ ప్రయోజనం ఏమిటని ఒక సామాన్య రోగిని అడిగితే ‘అసలు నా బాధ ఏమిటో హోమియో వైద్యుడు ఆలకిస్తాడు’ అని టక్కున సమాధానం ఇస్తాడు. మనిషిని కేవలం ఒక రోగి(యంత్రం)లా చూస్తూ నిమిషాల్లో మందుల చీటీ రాసి ఇవ్వడం కాకుండా... 

అంతర్యామి

  • మహిత గుణ సంపద

    ’- హితోపదేశంలోని ఒక శ్లోక భావం ఇది. గుణాల వల్ల కలిగే కీర్తి చరిత్రలు నాశనం లేనివని అర్థం. సద్గుణ సంపత్తి గలవారి జీవితాలు ఎల్లప్పుడూ ...
  • తరువాయి

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఒక్కటే మాట.. బ్లాక్‌బస్టర్‌
  • రివ్యూ: వకీల్‌ సాబ్‌
  • అలీబాబా.. అరడజను కష్టాలు
  • మూడేళ్ల తర్వాత కూడా అదే పవర్‌ : చిరు
  • ఉద్వేగానికి లోనైన వేణు శ్రీరామ్‌
  • డెత్‌ స్పెషలిస్టు అతడే.. 20 పరుగుల లోటు
  • దొరికిన ఆభరణాల్లో వాటా ఇవ్వాలి
  • పవన్‌ అభిమాని తీరుపై అనసూయ అసంతృప్తి
  • పవన్‌ చూసి నిర్మాతనని మర్చిపోయా: దిల్‌ రాజు
  • విడాకులు తీసుకుంటే OCI హోదా ఉండదు!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.