మేలుకలుపు అదనం అవసరమైతేనే
కారు కొంటాం...దాంతోపాటు మనదైన ముద్ర ఉండాలనుకుంటాం...కొత్త పార్ట్లు బిగిస్తాం...మార్పుచేర్పులెన్నో చేస్తాం...ఇవన్నీ సరే...ఈ అదనాలు కొన్నిసార్లు ప్రమాదాలూ మోసుకొస్తాయంటారు నిపుణులు...అవేంటో తెలుసుకుందాం..జాగ్రత్త పడదాం. కారు కొన్న తర్వాత దానికి హంగులు అద్దడానికో, సౌకర్యాలు పెంచుకోవడానికో కొన్ని పార్ట్లు బిగిస్తాం. సాధారణంగా వీటి వల్ల ఎక్కువసార్లు అదనపు ప్రయోజనమే ఉంటుంది....