☰
గురువారం, ఏప్రిల్ 15, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 01/03/2021 13:34 IST
రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఉద్రిక్తత

రేణిగుంట: తెదేపా అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా రేణిగుంట విమానాశ్రయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కొవిడ్‌ నిబంధనల్లో భాగంగా పర్యటనకు అనుమతి లేదంటూ చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విమానాశ్రయంలోనే చంద్రబాబు ఉండిపోయారు. మరోవైపు తెదేపా శ్రేణులు పెద్దసంఖ్యలో విమానాశ్రయానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

నేలపై బైఠాయించి నిరసన
తన పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో చంద్రబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఎస్పీ, కలెక్టర్‌ను కలిసి తన పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వలేదో తెలుసుకుంటానని చంద్రబాబు చెప్పినా.. పోలీసులు అనుమతించలేదు. పర్యటనకు ఎందుకు వచ్చానో.. తననెందుకు ఎయిర్‌పోర్టులో నిలిపేశారో మీడియాకు వివరిస్తానని చెప్పినా పోలీసులు అందుకు నిరాకరించారు. దీంతో ఆయన విమానాశ్రయంలోనే నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చంద్రబాబును కలవడానికి వచ్చిన రైల్వేకోడూరు నియోజకవర్గ నేత నరసింహ ప్రసాద్‌ను పోలీసులు తోసేశారు. మరోవైపు విమానాశ్రయానికి వచ్చిన తెదేపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

చంద్రబాబుకు నోటీసులు

నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరిస్తూ చంద్రబాబుకు రేణిగుంట పోలీసులు నోటీసులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకున్నట్లు తమకు తెలియదని అందులో పేర్కొన్నారు. చంద్రబాబు తలపెట్టిన పర్యటన ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగేలా ఉందని వెల్లడించారు.

తెదేపా నేతల గృహనిర్బంధం

చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పలువురు తెదేపా నేతలను గృహనిర్బంధం చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతిలో తెదేపా నేత నర్సింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను పోలీసులు నిర్బంధించారు.


ఇవీ చదవండి

  • చిత్తూరు జిల్లాలో తెదేపా నేతల గృహనిర్బంధం

  • అవినీతిపై పోరుకు కండబలమూ కావాలి

Tags: AP newsఆంధ్రప్రదేశ్‌ వార్తలుTDPతెదేపాchandrababuచంద్రబాబు

మరిన్ని

  • ఈసీ.. ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది: శివసేన[23:09]
  • ‘కోచ్‌బిహార్‌’ బాధ్యులను శిక్షిస్తాం: దీదీ[22:36]
  • బెంగాల్‌: అఖిలపక్ష భేటీకి ఈసీ పిలుపు[22:14]
  • భాజపాకు 70 సీట్లు కూడా దక్కవు: దీదీ[20:49]
  • ‘నిన్న రాళ్ల వర్షం.. ఇవాళ కరెంటు బంద్’[19:56]
  • ఆగం కావొద్దు ఆలోచించి ఓటేయండి: కేసీఆర్‌[18:39]
  • కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న భాజపా శ్రేణులు[17:43]
  • రెండోస్థానం కోసం తెదేపా పోటీ: కన్నబాబు[16:10]
  • త్వరలో కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు: కేటీఆర్‌[15:41]
  • దయనీయంగా ప్రైవేటు టీచర్ల పరిస్థితి: జీవన్‌రెడ్డి[14:48]
  • వైఎస్‌ షర్మిల దీక్షకు పోలీసుల అనుమతి[14:15]
  • జైలుకెళ్లేందుకు జగన్‌ సిద్ధమవ్వాలి: చింతా[13:26]
  • ప్రజల ఆరోగ్యాన్ని తెరాస పణంగా పెట్టింది..[12:52]
  • జగన్‌ అన్నింటిలోనూ అసమర్థుడు: సోము[12:42]
  • దళితుల అండ దక్కేదెవరికో![11:37]
  • వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసిన లోకేశ్‌[11:29]
  • ఫలితాలు రాకముందే.. అభ్యర్థులు రిసార్టులకు![10:22]
  • తప్పుడు కేసులతో వేధించే యత్నం: చంద్రబాబు[01:21]
  • కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా ఫిర్యాదు[01:14]
  • బెంగాల్‌ పోరు: భాజపా నేతలకు ఈసీ చురకలు![01:07]
  • ‘నేతల కొనుగోలు తెరాసకు పరిపాటిగా మారింది’[01:04]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • వకీల్‌సాబ్‌.. పవన్‌ని హత్తుకున్న తారక్‌!
  • ఉత్కంఠ పోరులో బెంగళూరుదే విజయం
  • సామ్‌ జీవిత పాఠాలు.. తల పట్టుకున్న చాందిని
  • రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
  • మహారాష్ట్రను కలవరపెడుతోన్న ‘డబుల్‌ మ్యుటేషన్‌’!
  • తొషిబా సీఈవో రాజీనామా
  • వాల్ట్‌ డిస్నీ భారతీయ విభాగం చీఫ్‌గా మాధవన్‌
  • సచిన్ వాజే కేసులో కొత్త ట్విస్ట్‌..!
  • మోడెర్నా టీకా: 6 నెలలైనా అదే సామర్థ్యం!
  • వైకాపా ఎమ్మెల్యేకు కరోనా..ఐసీయూలో చికిత్స
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.