గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

‘‘సమష్టిగా ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకుందాం’’

తెలంగాణ సీఎంకు కాంగ్రెస్‌ లేఖ

హైదరాబాద్‌: కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఆల్మట్టి ఎత్తు పెంపును తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ప్రస్తుతమున్న ఆల్మటి ప్రాజెక్టు ఎత్తును పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం పంపినట్లు కర్ణాటక నీటి వనరుల శాఖ మంత్రి రమేశ్‌ జార్కి హోలి స్వయంగా ప్రకటించారని, ఎత్తు పెంపునకు చర్యలు వేగవంతం చేస్తున్నారని తెలిపారు. దానిని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలని కోరుతూ ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీధర్‌రెడ్డి, జాతీయ కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి సంయుక్తంగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 

‘‘ఆల్మట్టి ఎత్తు ఒకేసారి 519.6 మీటర్ల నుండి 524.2 మీటర్లకు, అంటే 4.6 మీటర్లు పెంచడం వల్ల ఇప్పుడు వాడుతున్న 173 టీఎంసీల నీరు కాక 303 టీఎంసీలు కర్ణాటక రాష్ట్రమే వాడుకోవచ్చు. తద్వారా దిగువనుండే తెలంగాణకు రావాల్సిన 130 టీఎంసీల నీటిని కర్ణాటక అదనంగా వాడుకోనుంది. గతంలోనే బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్.. చాలా స్పష్టంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ఆధారంగా, ఆల్మట్టి ఎత్తు 518.7 మీటర్లు సరిపోతుందని నివేదిక ఇచ్చింది. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఒక్కసారి మాత్రమే వరదలు సంభవించాయి. కృష్ణ నదిపై నిర్మించిన తెలంగాణలోని జూరాల, నాగార్జున సాగర్, ఏపీలోని శ్రీశైలం వరదల సమయంలో మాత్రమే నిండుతాయి. ఒకవేళ అల్మట్టి ఎత్తు పెరిగితే.. కర్ణాటక రాష్ట్రం అదనంగా 130 టీఎంసీల  వరద నీటిని నిల్వ చేయడానికి వీలు కలుగుతుంది. అందువల్ల మిగులు నీటిపై ఆధారపడిన తెలంగాణలోని నెట్టంపాడు, కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి, డిండి, ఎస్‌ఎల్‌బీసి, ఎఎమ్‌ఆర్‌పీ ప్రాజెక్టులకు.. మహాబుబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలతోపాటు, మొత్తంగా దక్షిణ తెలంగాణలోని 27.4 లక్షల ఎకరాలకు నీటి లభ్యత ప్రమాదం ఏర్పడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకే కాదు. ఎగువనుండే మహారాష్ట్రకు నష్టం వాటిల్లుతుంది’’అని లేఖలో పేర్కొన్నారు. 

అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో 2013 డిసెంబర్‌ 10న జరిగిన అఖిలపక్ష సమావేశానికి తెరాస నేతలు మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌, దివంగత విద్యాసాగర్‌ హాజరయ్యారని, ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును పెంచాలని బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును అప్పుడు గట్టిగా వ్యతిరేకించారని సీఎం కేసీఆర్‌కు లేఖ ద్వారా కాంగ్రెస్‌ గుర్తు చేసింది. నాడు కాంగ్రెస్ నేతృత్వంలో అన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య, సమష్టిగా పోరాడి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై కాకుండా సుప్రీంకోర్టులో విజయం సాధించామని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు.

‘‘ఎగువన ఆల్మట్టి ద్వారా, దిగువన పోతిరెడ్డిపాడు ద్వారా తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది. అందుకే మన రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి.. సమిష్టిగా, ఒక నిశ్చయంతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పోరాడవలసిన సమయం ఇది. లేకపోతే దిగువ రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టం కలుగుతుంది. కాబట్టి.. తక్షణమే సంఘటితంగా కర్ణాటక ఎత్తుగడలను తిప్పికొట్టేలా కార్యాచరణ రూపొందించాలి’’అని కేసీఆర్‌ను కాంగ్రెస్‌ నేతలు కోరారు. 

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని