గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

‘దృష్టిని మరల్చేందుకే సచివాలయం కూల్చివేత’

జన్‌ సంవాద్‌ భేటీలో బండి సంజయ్‌

హైదరాబాద్‌: పాలమూరులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా మొదలుపెట్టలేదని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల భాజపా జన్‌ సంవాద్‌ సభలో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. కరోనా కట్టడికి ఒక్క రూపాయి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. కరోనా సమయంలో దేశాన్ని ఆదుకోవడానికి ప్రధాని నరేంద్ర  మోదీ రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారని తెలిపారు. నీటి ప్రాజెక్టుల విషయంలో ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఏమీ లేదని చెప్పారు.  కరోనా నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సచివాలయం కూలగొడుతున్నారని ఆరోపించారు. సచివాలయం కూల్చే పైసలతో కరోనా ఆసుపత్రి కట్టొచ్చని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

పేదవారికి ఆహారం అందించింది భాజపానే: మురళీధర్‌ రావు

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అమాయకులు కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు ఆరోపించారు. అరవై సంవత్సరాల కాంగ్రెస్‌ పాలనలో కనీస వైద్య సదుపాయాలు మన దేశంలో లేవన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకుని లాక్‌డౌన్‌ పెట్టారని చెప్పారు. ఇప్పటి వరకు పార్టీ రాజకీయాల గురించి మాట్లాడని ఏకైక ప్రధాని మోదీనేనని పేర్కొన్నారు. 22 కోట్ల మంది పేదవారికి ఆహారం అందించిన పార్టీ భాజపా అని తెలిపారు. ఎఫ్‌సీఐ ద్వారా వరిని కొనుగోలు చేసింది కేంద్ర ప్రభుత్వమని, తెరాస వాళ్లు తాము కొనుగోలు చేస్తున్నామంటూ చెప్పుకొంటున్నారని మురళీధర్‌ రావు అన్నారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని