గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

మళ్లీ అప్పుడు జిల్లాలు మారుస్తారా?: సోమిరెడ్డి

అమరావతి: పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన ఏపీలో జిల్లాల పెంపు యోచన సరికాదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. విజయనగరం, నెల్లూరు, శ్రీకాకుళం, కడప, లాంటి జిల్లాలను పెంచాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. పెద్ద జిల్లాలను విభజిస్తే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని అన్నారు. 2026లో మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగడం వల్ల పార్లమెంటు నియోజకవర్గాల హద్దులు మారిపోతాయని, అప్పుడు జిల్లాలను మళ్లీ మారుస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటి నుంచి విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకులకు కూడా ఈ నిర్ణయం అంతగా నచ్చడం లేదు. ఓ పక్క స్వాగతిస్తున్నామని చెబుతూనే పునఃపరిశీలించాలని అంటున్నారు. వైకాపా ఎమ్మెల్యే, సీనియర్‌ నాయకుడు ధర్మాన ప్రసాదరావు కూడా బుధవారం ఈ అంశంపై స్పందించారు. శ్రీకాకుళం జిల్లాలను విభజించవద్దని కోరారు. ఒక వేళ అలా చేస్తే.. రాజకీయంగానూ ఇబ్బంది పడే అవకాశముందని అభిప్రాయడ్డారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని