మంగళవారం, జూన్ 02, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

‘వైఎస్‌ హయాంలోని చట్టాన్ని అమల్లోకి తెండి’

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఎంపీ కేవీపీ సూచన

హైదరాబాద్: తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) రోగులకు సేవలందిస్తున్న వైద్యసిబ్బందిపై దాడులను ఖండిస్తున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు చెప్పారు. వైద్యసిబ్బంది, ఆస్పత్రులపై దాడులకు వ్యతిరేకంగా దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి ఏపీ 2007లో చట్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చేసిన ఆ చట్టాన్ని వెంటనే అమలులోకి తేవాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కేవీపీ సూచించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కేవీపీ కోరారు. ఇలాంటి ఆపత్కాల సమయంలో అందరి క్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించే మార్గదర్శకాలను, విధించే ఆంక్షలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు కష్టాల్లో ఉన్నవారికి పార్టీ కార్యకర్తలు సాయమందించాలని ఆయన సూచించారు.

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)