మంగళవారం, జూన్ 02, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఇలాంటి సమయంలో రాజకీయాలా?: అమిత్‌ షా

దిల్లీ: కరోనా మహమ్మారిపై దేశం పోరాటం చేస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆ పార్టీపై మండిపడ్డారు. ఇలాంటి సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడం మాని.. దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలని సూచించారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విషయంలో కేంద్రం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించలేదన్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా స్పందించారు.

‘‘ప్రధాని నేతృత్వంలోని దేశం కరోనా మమహమ్మారిపై పోరాడుతోంది. 130 కోట్ల మంది ఒక్కటయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్‌ చిల్లర రాజకీయాలకు దిగుతోంది. ఇలాంటి సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదు.. జాతి ప్రయోజనాల కోసం ఆలోచన  చేయాలి’’ అని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)