☰
శుక్రవారం, ఫిబ్రవరి 26, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

వార్తలు / కథనాలు

Published : 19/01/2021 01:10 IST
చీరకట్టుతో కమలా హారిస్‌ ప్రమాణ స్వీకారం?

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ మూలాలున్న కమలా హారిస్‌.. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కేవలం రెండే రోజుల వ్యవధి ఉంది. కట్టుదిట్టమైన భద్రతా నిబంధనల నడుమ బుధవారం జరగనున్న ఈ కార్యక్రమంలో ఆమె ఏం ధరిస్తారనే విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎన్నికల సందర్భంగా కమల తన భారతీయ మూలాలను పలుమార్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమె చీరను ధరించి అధికారాన్ని స్వీకరిస్తారనే అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.

కమల చీర కట్టుకుంటారా?

2019లో ఓ ఎన్నికల సమావేశం సందర్భంగా విజయం సాధిస్తే చీర కట్టుకుంటారా అని కమలను ప్రశ్నించినప్పుడు.. ముందు గెలుద్దాం అని ఆమె సమాధానమిచ్చాట. భారతీయ సంస్కృతి, వారసత్వం పట్ల తమకు అమిత గౌరవం ఉండేలాగ తన తల్లి తమను పెంచారని.. ఇంటిపేరుతో సంబంధం లేకుండా తాము అన్ని పండుగలను జరుపుకొంటామని కూడా ఆమె అన్నారట. కమల తల్లి శ్యామలా గోపాలన్‌ చెన్నైలో పుట్టి పెరిగి.. అమెరికాకు వలస వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ.. చీరను ధరించటం చేయటం ద్వారా ఆమెకు మరింత నైతిక బలం చేకూరుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మేడం వైస్‌ ప్రెసిడెంట్‌.. అది నాకు గౌరవం

అధికార స్వీకరణ సమయంలో మేడం వైస్‌ ప్రెసిడెంట్‌ చక్కటి బెనారస్‌ పట్టుచీరలో కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదని.. న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ బిబు మొహాపాత్ర ఇటీవలి ఇంటర్వూలో చెప్పారు. ఆ ముఖ్య సందర్భంలో ఆమెకు వస్త్రాలంకరణ చేయటం తనకు ఎంతో గౌరవకారకమని కూడా ఒడిషాకు చెందిన ఆయన సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. దీనితో కమల ‘ఆరుగజాల వస్త్ర విశేషం’ అయిన చీరలో కనిపించవచ్చనే ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

ఒక్క సెకెనున్న వీడియోతో..

56ఏళ్ల ఈ రాజకీయవేత్త, నిజానికి ఎన్నో ఏళ్లుగా ఫార్మల్‌ సూట్లనే ధరిస్తూ వచ్చారు. కాగా, ఇప్పుడు కూడా ఆమె అదే అలవాటును కొనసాగిస్తారనే వారూ లేకపోలేదు. ఇక ఆమె ఏం ధరిస్తారనేది అంత ముఖ్య విషయం కాదనే వారూ లేకపోలేదు. ఐతే ఈ అభిప్రాయం తప్పని ఒక్క సెకెను కంటే తక్కువ నిడివిగల ఓ సోషల్‌ మీడియా పోస్టు ద్వారా రుజువైంది. కమల సమీప బంధువు మీనా హారిస్‌ ఇటీవల ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో ‘‘ఫ్యూచర్‌ ఈజ్‌ ఫిమేల్‌’’ (ఆడవారిదే భవిష్యత్తు) అని రాసి ఉన్న సాక్సులను హారిస్‌ ధరించటం చూడవచ్చు. దీనితో సంబంధిత కంపెనీ సాక్సులకు డిమాండ్‌ విపరీతంగా పెరిగి.. స్టాకు అందుబాటులో లేకుండా పోయిందట.

అమెరికా ఉపాధ్యక్షురాలిగా అత్యున్నత స్థానానికి చేరుకున్న తొలి మహిళగానే కాకుండా నల్లజాతీయురాలిగా, దక్షణాసియా మూలాలున్న వ్యక్తిగా కూడా కమలా హారిస్‌ నిలిచిపోనున్నారు. ఆ చారిత్రాత్మక సమయంలో ఆమెకు సంబంధించిన చిన్న అంశమైనా పెద్ద ప్రభావాన్నే కలుగచేస్తుందనే విషయంలో సందేహం లేదు. ఈ సందర్భంగా కమలా హారిస్‌ చీరకట్టు, అమెరికాలో ఉండే మైనారిటీల ప్రతినిధిగా ప్రపంచానికి ఓ చక్కటి సందేశాన్నిస్తుందని పరిశీలకులు అంటున్నారు.

ఇవీ చదవండి..

బైడెన్‌-హారిస్‌కు ముగ్గులతో స్వాగతం

Tags: international newsఅంతర్జాతీయ వార్తలుUS newsఅమెరికా వార్తలుNRI newsఎన్నారై వార్తలుkamala harrisకమలా హారిస్‌US vice presidentఅమెరికా ఉపాధ్యక్షురాలుsareeచీర

మరిన్ని

  • ఘనంగా దేవులపల్లి సాహితీ వైభవ కార్యక్రమం పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత, కళాప్రపూర్ణ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి వర్థంతి సందర్భంగా సాహితీ వైభవం కార్యక్రమంగా అంతర్జాలం
  • అమెరికాలో వీసా బ్యాన్‌ ఉపసంహరణ..!   కరోనా వైరస్‌ వ్యాప్తి సమయంలో  ఇబ్బందుల్లో ఉన్న అమెరికాలోని కార్మికుల అవకాశలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే కారణంతో ట్రంప్‌ సర్కారు వలసదారులు అమెరికాలో ప్రవేశించడాన్ని నిషేధిస్తూ
  • డాలరు చదువు.. ఇక రూపాయల్లో!  విదేశీ డిగ్రీ పట్టాలు సాధించాలంటే భారతీయ విద్యార్థులు ఇకపై ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు! స్వదేశంలో ఉంటూనే..
  • అమెరికా అవార్డుకు ఎంపికైన భారత మహిళ అమెరికా అందించే అంతర్జాతీయ అవినీతి నిరోధక ఛాంపియన్‌ అవార్డుకు ప్రముఖ భారత సామాజికవేత్త అంజలి భరద్వాజ్‌ ఎంపికయ్యారు. పారదర్శకత, జవాబుదారీతనం కోసం అంజలి చేస్తున్న కృషికి గానూ ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు....
  • అమెరికా: కీలక పదవిలో బిదిశా భట్టాచార్య భారత సంతతికి చెందిన మరో మహిళకు బైడెన్‌ ప్రభుత్వంలో కీలక స్థానం దక్కింది. వాతావరణం, ఇంధన నిపుణురాలైన బిదిశా భట్టాచార్యను అమెరికా ప్రభుత్వంలోని ఫార్మ్‌ సర్వీస్‌ ఏజెన్సీకి..
  • అమెరికా టీకా కార్యక్రమంలో భారతీయ వైద్యులు  న్యూజెర్సీలో కొవిడ్‌ టీకా కార్యక్రమంలో సహకరించేందుకు భారతీయ-అమెరిన్‌ వైద్యులు ముందుకు వచ్చారు
  • ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రయాణికులకు.. ఈ-బోర్డింగ్‌ కాగిత రహిత విమానాశ్రయం దిశగా హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం మరిన్ని అడుగులు వేస్తోంది. ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌లో వెళ్లే ప్రయాణికులకు
  • అమరావతి కోసం.. అమెరికాలో నిరవధిక నిరశన రాష్ట్ర రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఒకవైపు ఆ ప్రాంతంలో నిరవధికంగా ఉద్యమం కొనసాగుతుంటే..
  • అర్థంకాని భాషలో చెప్పడం వ్యర్థం పాఠశాలల్లో ప్రాథమిక విద్యాభ్యాసం తెలుగులోనే కొనసాగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు...
  • భారత-విదేశీ విద్యాసంస్థలు ఉమ్మడి డిగ్రీలు ఇవ్వొచ్చు భారత, విదేశీ ఉన్నత విద్యాసంస్థలు కలిసి ఉమ్మడి లేదా డ్యూయల్‌ డిగ్రీలు ఇచ్చేందుకు అనుమతి లభించింది.
  • తేనెలొలికే తెలుగు.. భవితకదే వెలుగు ద్రవిడ భాషల్లో తొలిసూరు బిడ్డలాంటి మన తెలుగు భాషను కొత్త తరం మరో తీరానికి తీసుకొని వెళ్తోంది.
  • ఏడాది చివరికి సాధారణ పరిస్థితులు ఈ ఏడాది చివరి నాటికి అమెరికాలో మునుపటి మాదిరి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని
  • రాజకుటుంబానికి రాంరాం బ్రిటన్‌ యువరాజు హ్యారీ, భార్య మేఘన్‌ మార్కెల్‌ తిరిగి రాజకుటుంబంలో సభ్యులుగా చేరడానికి ఇష్టపడడం లేదని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. రాజ కుటుంబ బాధ్యతలకు దూరంగా, ఆర్థికంగా స్వతంత్రంగా బతకాలని గత
  • గ్రీన్‌కార్డు నిరీక్షణకు తెర! అమెరికా పౌరసత్వం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణుల కల ఇక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వలస విధానాల్లో సంస్కరణ దిశగా అమెరికా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఓ నూతన బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది. చాలా ఏళ్లుగా అమెరికాలో అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్న సుమారు 1.1 కోట్ల మందికి పౌరసత్వం కల్పించనున్నారు.
  • కుదుటపడుతున్న టెక్సాస్‌! మంచు తుపాను ధాటికి వణికిపోయిన టెక్సాస్‌ నగరం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ప్రస్తుతం హిమపాతం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న విద్యుత్‌ గ్రిడ్‌ పునరుద్ధరణ జరుగుతోంది.
  • భారతీయుల గ్రీన్‌కార్డు ఎదురు చూపులకు చెక్‌.. అమెరికాలో ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న భారతీయులకు ప్రయోజనం కలగనుంది.
  • భారతీయ మహిళకు ఐరాస ఉన్నత పదవి యూఎన్‌డీపీ అండర్‌ సెక్రటరీ జనరల్‌గా ఉషారావు మొనారీ
  • శ్వేతసౌధం.. ఓ స్వర్ణపంజరం శ్వేతసౌధంలో జీవనం ‘బంగారు పూత పూసిన పంజరం’లా ఉందని అమెరికా అధ్యక్షుడు
  • అమెరికాపై హిమఖడ్గం మంచు తుపాను ధాటికి అమెరికా చిగురుటాకులా వణుకుతోంది. పలు రాష్ట్రాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. టెక్సాస్‌, ఒక్లాహామా, టెన్నెసీ, ఇల్లినాయిస్‌ రాష్ట్ర ప్రజలు మంచు తుపానుతో ఇక్కట్లు పడుతున్నారు. ఈ నెల 14 నుంచి ఇప్పటివరకు మంచు తుపానుకు దాదాపు 20 మంది మృతి చెందారని
  • చలో అమెరికా... అమెరికా విద్యకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మళ్లీ ఉత్సుకత చూపుతున్నారు. గత ఏడాది కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలంతో ఆగిపోయిన వారితోపాటు త్వరలో ఇక్కడ చదువు పూర్తికానున్న విద్యార్థులు
  • సింగపూర్‌ విదేశీ కార్మికుల సంఖ్యలో కోత విదేశీ కార్మికులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే లక్ష్యంతో సింగపూర్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
  • కెనడాలో భారతీయులకు బెదిరింపులు.. కెనడాలో నివసించే భారతీయులకు బెదిరింపులు ఎదురవటంతో భారత రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది.
  • మరో భారత సంతతి మహిళకు కీలక పదవి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అధికారిక యంత్రాంగంలో మరో భారత సంతతి మహిళకు చోటుదక్కింది. అమెరికా పాలసీ కౌన్సిల్‌లో కార్మిక, ఉద్యోగ విభాగాలకు సంబంధించి జో బైడెన్‌ ప్రత్యేక సహాయకురాలిగా భారతీయ అమెరికన్‌ ప్రొనీతా గుప్తాను ఎంపిక చేశారు....
  • విదేశీ వైద్య విద్యకు కరోనా దెబ్బ కరోనా సృష్టించిన భయానక వాతావరణంతో విదేశాల్లో వైద్య విద్య చదవాలని అనుకుంటున్న వారిలో కొందరు
  • ట్రంప్‌పై 9/11 తరహా కమిషన్‌! క్యాపిటల్‌ హింసాకాండ చిక్కుల్లోంచి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బయటపడేలా
  • టెక్సాస్‌లో భారీ మంచు తుపాను అమెరికాలో శీతాకాలంలో పడిపోయిన ఉష్ణోగ్రతలకు తోడు భారీగా కురుస్తున్న మంచు తుపాను వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా టెక్సాస్‌ రాష్ట్రంలో మైనస్‌ 5 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడి రహదారులపై
  • ఎలా ఉన్నారు?.. ‘నాన్‌స్టాప్‌’ వ్యాపారం బాగుందా?   ప్రపంచంపై పడగవిప్పిన కరోనా వైరస్‌ అన్ని వ్యాపారాలనూ కుదేలయ్యేలా చేసింది. ముఖ్యంగా అమెరికాను కకావికలం చేసిన ఈ మహమ్మారి‌.........
  • బైడెన్‌ బృందంలోకి మరో ఇద్దరు.. ప్రజాసేవల విభాగంలో నిపుణులైన ఇద్దరు భారతీయ-అమెరికన్లను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తాజాగా కీలక పదవుల్లో నియమించారు. స్వచ్ఛంద సేవకు సంబంధించిన ఫెడరల్‌ ఏజెన్సీ ‘అమెరికార్ప్స్‌’కు జాతీయ
  • రైతులకు  ప్రవాసీయుల ‘గులాబీ’ మద్దతు నేడు ప్రేమికుల రోజు సందర్భంగా విభిన్నమైన ‘రోజ్‌ క్యాంపెయిన్‌’ను ప్రారంభించాయి.
  • సింగపూర్‌లో వాసవీ మాత ఆత్మార్పణ కార్యక్రమాలు సింగపూర్‌లోని స్థానిక వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • పాపం ప్రియ.. షారుఖ్‌ తనయ‌..
  • పిచ్‌తో కాదు బ్యాటింగ్‌ వల్లే 2 రోజులు: కోహ్లీ
  • పెళ్లిపై స్పందించిన విశాల్‌
  • నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
  • రేపు భారత్‌ బంద్‌
  • భారత్‌కే ‘ఫైనల్‌’ అవకాశం: ఇంగ్లాండ్‌ ఎలిమినేట్‌
  • రెండు రోజుల సంబరం.. కోహ్లీసేన అంబరం
  • ఆక్సిజన్‌ కొరత..ఆఫ్రికా, లాటిన్‌ దేశాలు విలవిల!
  • స్టార్స్‌తో శ్రీముఖి.. ఫొటోలు వైరల్‌
  • ‘గులాబి’ ఘనతలు: ధోనీ రికార్డుకు కోహ్లీ బీటలు
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.