విశ్వ భారతీయం.. విదేశాల్లో మనోళ్లే టాప్!
ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో నివసిస్తున్న వారిలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. 2020 నాటికి కోటి 80లక్షల మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నట్లు ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం యూఎస్‌డీఈఎస్‌ఏ విడుదల చేసిన ‘అంతర్జాతీయ వలసలు 2020’ నివేదిక బహిర్గతం చేసింది.