☰
శనివారం, ఏప్రిల్ 10, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Published : 08/04/2021 04:29 IST
లాక్‌డౌన్‌ భయంతో సొంతూళ్లకు!

పట్టణాలను వీడుతున్న వలస కార్మికులు

దిల్లీ, పట్నా: దేశంలో కరోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతుండటంతో... ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్‌ విధించవచ్చని వలస కార్మికులు భావిస్తున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఇప్పుడు ఉన్నఫళంగా లాక్‌డౌన్‌ విధిస్తే... తమకు నాటి కష్టాలు మళ్లీ తప్పవన్న భయం కార్మికుల్లో నెలకొంది. ముందుజాగ్రత్త చర్యగా వారు పట్టణాలను వీడి సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఇలా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి బిహార్‌కు తరలివస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో తూర్పు మధ్య రైల్వే వారి కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది. గుజరాత్‌, దిల్లీ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వలస కార్మికులు భారీ సంఖ్యలో తమ సొంతూళ్లకు పయనమవుతుండటం గమనార్హం. ఇక్కడి పట్టణ ప్రాంతాల్లోని బస్సుస్టేషన్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా నిరుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నఫళంగా లాక్‌డౌన్‌ విధించడంతో వలస కార్మికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. చేసేందుకు పని, ఉండేందుకు వసతి, తినేందుకు ఆహారం లేక... మండుటెండల్లో వందలాది కిలోమీటర్లు నడుచుకుంటూ తమ సొంత ప్రాంతాలను చేరుకున్న సంగతి తెలిసిందే!

Tags:

మరిన్ని

  • కరోనా కట్టడికి డబ్ల్యుహెచ్‌ఓ సూచనలు దేశంలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను కట్టడి చేసేందుకు సూచనలిచ్చింది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని భద్రతా ప్రోటోకాల్స్‌ తప్పకుండా పాటించడమే మార్గమని పేర్కొంది
  • అంతర్గత వ్యవహారాల్లో  బయటివారి సలహాలు అక్కరలేదు! దేశ అంతర్గత వ్యవహారాల్లో బాహ్య శక్తుల ప్రమేయం గురించి ఉపాధ్యక్షుడు వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌ సమస్యను పరిష్కరించడానికి ఇతరదేశాల సలహాలు అవసరం లేదని,
  • కొవిడ్‌ టీకాకు వస్తే..  రేబిస్‌ వ్యాక్సిన్‌ వేశారు! కొవిడ్‌ టీకా వేయించుకోవడానికి ముగ్గురు వయోధికులైన మహిళలు రాగా.. ఆరోగ్య సిబ్బంది యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ వేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షమ్లీ జిల్లా కందార పీహెచ్‌సీలో వెలుగుచూసింది. ఈ ఆరోగ్యకేంద్రానికి కొవిడ్‌-19 టీకా వేయించుకోవడానికి
  • కశ్మీర్‌పై విదేశాల సలహాలు అక్కర్లేదు జమ్మూ-కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని, ఇక్కడి సమస్యలను పరిష్కరించుకొనే శక్తిసామర్థ్యాలు దేశానికి ఉన్నాయని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. కశ్మీర్‌పై తమకు సలహాలిచ్చే దేశాలు ముందుగా వారి అంతర్గత సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు.
  • బ్రిటన్‌ రాణి భర్త కన్నుమూత బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ (99) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆయన విండ్సర్‌ కేజిల్‌లో తుదిశ్వాస విడిచినట్లు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌ 10న ఆయన శత జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సి ఉంది. కొంతకాలంగా గుండె సంబంధ సమస్యతో బాధపడుతూ వచ్చిన ఆయన.
  • బెంగాల్‌లో నేడే 4వ విడత బెంగాల్‌లో నాలుగో విడత ఎన్నికలకు సర్వం సన్నద్ధమైంది. 44 నియోజకవర్గాలకు శనివారం పోలింగ్‌ జరగనుంది. ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద 78,900 మంది కేంద్ర సాయుధ బలగాలను మోహరించింది. కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో(భాజపా)
  • రైళ్లు ఆపే ఉద్దేశం లేదు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ రైళ్లు ఆపే ఉద్దేశం ఏమీ లేదని రైల్వేబోర్డు ఛైర్మన్‌ సునీత్‌ శర్మ స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం దిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దేశంలో అన్ని గమ్యస్థానాలకూ తగిన సంఖ్యలో సర్వీసులను నడపడానికి అనువుగా రైళ్లను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.
  • భారత జలాల్లో అమెరికా యుద్ధనౌక సంచారం స్వేచ్ఛాయుత నౌకాయాన హక్కు’ను చాటేందుకు భారత ప్రాదేశిక జలాల్లో లక్షదీవులకు సమీపంలో తమ నౌకాదళం ఒక ఆపరేషన్‌ నిర్వహించినట్లు అమెరికా తెలిపింది. ఇందుకోసం ఇండియా ముందస్తు అనుమతిని తీసుకోలేదని పేర్కొంది. భారత్‌ ‘మితిమీరి కోరుతున్న సముద్ర ప్రాదేశిక హక్కుల’ను సవాల్‌ చేసేందుకు ఈ చర్యను చేపట్టినట్లు పేర్కొంది.
  • కిలోమీటరు వెంబడించి.. ఐటీ అధికారిని పట్టుకున్న సీబీఐ రాత్రి 10 గంటలు.. ముంబయిలోని గోరెగావ్‌ తూర్పు ప్రాంతం.. రూ. 5 లక్షల లంచం సొమ్మును రోడ్డుపై పడేసి ఓ ఐటీ అధికారి పరుగెడుతుండగా, సినిమా ఫక్కీలో అతన్ని మరో సీబీఐ అధికారి వెంబడించారు. కిలో మీటరుకు పైగా పరుగెత్తి పట్టుకున్నారు.
  • కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు ఉమ్మడి పరీక్ష దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించడానికి కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. తెలంగాణలోని హైదరాబాద్‌ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం, ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీలు
  • రోడ్లు మూయొద్దు : సుప్రీం ప్రజలు రాకపోకలను సాగించే రహదారులను మూసివేయకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. రోడ్ల మూసివేత కారణంగా దిల్లీ వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్‌ అనే మహిళ దావా వేశారు. దీనిపై జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
  • భాజపాకు సాయం చేస్తున్న మమత తృణమూల్‌ అధినాయకి మమతా బెనర్జీ బెంగాల్‌ ప్రజలను మతపరంగా విభజిస్తున్నారని ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్‌ఎఫ్‌) వ్యవస్థాపకులు అబ్బాస్‌ సిద్దిఖీ ఆరోపించారు. ముస్లింల ఓట్లు తమకు వేయాలంటూ పిలుపునివ్వటం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు మమత సాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
  • ఆందోళనకరంగా టీకాల వృథా కరోనా టీకాల వృథాపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతోందని నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సీఈవో రామ్‌సేవక్‌ శర్మ తెలిపారు. ఇప్పుడున్న చిన్నచిన్న టీకా కేంద్రాలను పెద్దవిగా చేసి ఏకీకృతం చేయడం ద్వారా ఈ సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. ‘పబ్లిక్‌ అఫైర్స్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా’ శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు
  • ఫలించని వియెన్నా చర్చలు! ఇరాన్‌ అణు ఒప్పందంలోకి అమెరికాను తిరిగి తీసుకొచ్చేందుకు చేపట్టిన తాజా చర్చలు ఫలించలేదు! సంప్రదింపులను కొనసాగించాలని, మరింత అనుకూల వాతావరణాన్ని తీసుకురావాలని ఈ ఒడంబడికలోని భాగస్వామ్య దేశాలు నిర్ణయించాయి. 2015లో నాటి ఒబామా ప్రభుత్వం
  • టీకా పంపిణీలో అసమానత్వం ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ టీకా పంపిణీలో అసమానత్వం కొనసాగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ఇది సరైంది కాదని.. అన్ని దేశాలకు సమానంగా వ్యాక్సిన్‌ అందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ
  • రంజన్‌ గొగొయ్‌కు మాతృ వియోగం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయ్‌ మాతృమూర్తి శాంతి గొగొయ్‌ శుక్రవారం ఉదయం దిల్లీలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. అస్సాం మాజీ ముఖ్యమంత్రి కేశబ్‌ చంద్ర గొగొయ్‌ సతీమణి
  • యెస్‌ బ్యాంకు’ కేసులో రూ.77 కోట్ల ఆస్తుల జప్తు రూ.200 కోట్ల యెస్‌ బ్యాంకు రుణాల ఎగవేత కేసులో హెచ్‌డీఐఎల్‌ ప్రమోటర్లు రాకేశ్‌ వధ్వాన్‌, సారంగ్‌ వధ్వాన్‌కు చెందిన రూ.77 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ఈ కేసులో గతంలో కూడా ఈడీ ఆస్తులను జప్తు చేసింది. ఇప్పటివరకు
  • కెన్‌-బెట్వా నదుల అనుసంధానం వద్దు మధ్యప్రదేశ్‌లోని కెన్‌ నది, ఉత్తర్‌ప్రదేశ్‌లోని బెట్వా నదుల అనుసంధానం చేపట్టవద్దని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నదుల అనుసంధానంతో మధ్యప్రదేశ్‌లోని పన్నా పులుల అభయారణ్యానికి పెను ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
  • ఓలీ సర్కారు కూలిపోక తప్పదా! నేపాల్‌లో ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు కూలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి! తమ మద్దతు ఉపసంహరించుకుంటామని సీపీఎన్‌-మావోయిస్టు సెంటర్‌ ప్రకటించిన క్రమంలో... ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్‌ (ఎన్సీ) ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఒక్కటే మాట.. బ్లాక్‌బస్టర్‌
  • రివ్యూ: వకీల్‌ సాబ్‌
  • అలీబాబా.. అరడజను కష్టాలు
  • మూడేళ్ల తర్వాత కూడా అదే పవర్‌ : చిరు
  • ఉద్వేగానికి లోనైన వేణు శ్రీరామ్‌
  • డెత్‌ స్పెషలిస్టు అతడే.. 20 పరుగుల లోటు
  • దొరికిన ఆభరణాల్లో వాటా ఇవ్వాలి
  • పవన్‌ అభిమాని తీరుపై అనసూయ అసంతృప్తి
  • పవన్‌ చూసి నిర్మాతనని మర్చిపోయా: దిల్‌ రాజు
  • విడాకులు తీసుకుంటే OCI హోదా ఉండదు!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.