ముంబయి: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో కొత్త అవతారం ఎత్తాడు. ‘కెప్టెన్ 7’ పేరుతో తెరకెక్కనున్న యానిమేటెడ్ సిరీస్‌తో నిర్మాతగా అరంగేట్రం చేస్తున్నాడు. గూఢచర్యం నేపథ్యంలో నిర్మించనున్న ఈ సిరీస్‌లో తొలి సీజన్ ధోని మీదే నడుస్తుందట. ఇప్పటికే అది ప్రి ప్రొడక్షన్ పనుల్లో ఉంది. 7 అనేది ధోని జెర్సీ నంబర్ అనే సంగతి తెలిసిందే. మహి భార్య సాక్షికి చెందిన ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి బ్లాక్ వైట్ ఆరెంజ్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బీడబ్ల్యూఓ) ఈ సిరీస్‌ను రూపొందించనుంది. దేశంలోనే గూఢచర్యం నేపథ్యంలో రానున్న తొలి యానిమేటెడ్ సిరీస్ ఇదే అని నిర్మాతలు తెలిపారు. తొలి సీజన్‌ను 2022లో విడుదల చేయనున్నారు. ‘‘కథ, కథనం గొప్పగా ఉన్నాయి. క్రికెట్‌తో పాటు నా ఇతర అభిరుచులకు ఇది జీవం పోస్తుంది’’ అని ధోని చెప్పాడు. ఈ సిరీస్ పూర్తిగా సాహసోపేతంగా ఉంటుందని సాక్షి పేర్కొంది. ‘‘క్రీడలెప్పుడూ మా హృదయాలకు దగ్గరగా ఉంటాయి. మేం ధోనీకి గొప్ప అభిమానులం. ‘కెప్టెన్ 7’ను సృష్టించడానికి ఇంతకంటే కావాల్సిందేం ఉంటుంది? ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో జతకట్టడం కలలా ఉంది. ఈ సిరీస్‌ను అభిమానులకు వీలైనంత త్వరగా చూపించాలనే ఆత్రుతతో ఉన్నాం’’ అని బీడబ్ల్యూఓ వ్యవస్థాపకుడు, సీఈవో భావిక్ వోరా చెప్పాడు.