బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నునొప్పితో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చేరిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు కరోనా సోకింది. బెంగళూరులోని బౌరింగ్ ఆసుపత్రిలో ఆమెకు తొలుత రెండుసార్లు ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. ఆ ఆసుపత్రిలో సీటీ స్కాన్ లేకపోవడంతో అక్కడి నుంచి ఆమెను విక్టోరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చేసిన సీటీ స్కాన్ పరీక్షలో ఆమెకు కరోనా ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రక్తపోటు, మధుమేహం సమస్యలు ఉన్నాయని వివరించారు.