జాబితాలో కేంద్ర మంత్రులకూ..
దిల్లీ: రెండో దశలో జరిగే కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీకా వేయించుకోనున్నారు. ప్రధానితో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నారు. ప్రధాని సహా ముఖ్య నేతలకు రెండో దశలో టీకా వేస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. 50 ఏళ్ల వయసు పైబడిన వారికీ టీకా అందజేస్తామని తెలిపింది. రెండో దశలో తొలిరోజు ప్రధాని, ముఖ్యమంత్రులకు టీకాలు ఇవ్వనున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 50 ఏళ్లు పైబడిన వారితో పాటుగా కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు టీకాలు వేస్తామని తెలిపారు.
* ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో టీకా వేయించుకున్న లబ్ధిదారులతో శుక్రవారం మాట్లాడనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ఈ కార్యక్రమం జరగనుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగమైన ప్రజలు.. వారి అనుభవాలను మోదీతో పంచుకుంటారు.