☰
శనివారం, ఏప్రిల్ 10, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 03/03/2021 14:49 IST
ఇంటి దగ్గర టీకా తీసుకున్న కర్ణాటక మంత్రి

ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరిన కేంద్రం

బెంగళూరు: దేశంలో మార్చి 1 నుంచి రెండో దశ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా 60ఏళ్లు పైబడిన వారికి, 45ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక రోగులకు టీకాను అందిస్తున్నారు. ఇప్పటికే దేశంలో ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మంత్రులు టీకాలు తీసుకున్నారు. ప్రధాని మోదీ దిల్లీలోని ఎయిమ్స్‌లో టీకా తీసుకోగా, ఇతరులు దగ్గర్లోని ఆస్పత్రుల్లో టీకా తీసుకున్నారు. కానీ, కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్‌ మంగళవారం తన స్వగృహంలో టీకాను తీసుకున్నారు. దీన్ని ఆయన తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేయగా పలు విమర్శలు ఎదురయ్యాయి. ఈ ఘటనను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. కరోనా వ్యాక్సినేషన్‌ కోసం కఠిన నిబంధనలు రూపొందించామని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అన్నారు. ఈ విషయంపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరినట్లు ఆయన వెల్లడించారు.

మరోవైపు తనపై వస్తున్న విమర్శలపై మంత్రి బీసీ పాటిల్‌ స్పందించారు. తాను ఆస్పత్రికి వెళ్తే అక్కడి ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే ఇంటి దగ్గర టీకా తీసుకున్నానని ఆయన వివరణచ్చారు. కాగా దేశంలో ఇప్పటి వరకు కోటీ యాభైలక్షల మందికి వ్యాక్సిన్లు అందించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు టీకా కేంద్రాల్లో వ్యాక్సిన్‌ తీసుకొనేవారు ముందుగా కోవిన్‌ యాప్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని కేంద్రం సూచించింది. ప్రైవేటు కేంద్రాల్లో టీకా ధర రూ. 250గా ఉంది. పదివేల ప్రభుత్వ, 20వేల ప్రైవేటు కేంద్రాల్లో టీకాను అందిస్తున్నట్లు కేంద్రం గతంలో తెలిపింది.


ఇవీ చదవండి

  • కామెంట్ పాండా కన్ను పడితే

  • పేద దేశాలకు టీకా ఇంత ఆలస్యమా?

Tags: జాతీయవార్తలుNational newsకరోనాcoronaవ్యాక్సిన్‌vaccineవ్యాక్సిన్‌ పంపిణీvaccinationరెండో దశsecond phaseకర్ణాటకkarnatakaవ్యవసాయశాఖ మంత్రిagricultural ministerబీసీ పాటిల్‌BC patilకేంద్రంcentral governmentరాజేశ్‌ భూషణ్rajesh bhushanకేంద్ర ఆరోగ్య శాఖhealth ministry

మరిన్ని

  • మంచి మాటలంటే కేంద్రానికి అలర్జీ: రాహుల్ గాంధీ[19:04]
  • కరోనా కట్టడికి డబ్ల్యుహెచ్‌ఓ సూచనలు[18:22]
  • దీదీ..ఇది 2021: మోదీ[18:12]
  • లాక్‌డౌన్ ఉండదు కానీ..: కేజ్రీవాల్[18:02]
  • 150మంది మాపై దాడి చేయడంతోనే..  [17:26]
  • ఆ 10 జిల్లాల్లోనే 45% యాక్టివ్‌ కేసులు!  [16:56]
  • అంతర్గత వ్యవహారాల్లో  బయటివారి సలహాలు అక్కరలేదు![16:21]
  • కరోనా సెకండ్‌ వేవ్‌: చిన్నారులపైనా ప్రభావం[16:10]
  • అక్కడ.. అదను చూసి కరోనా బుసలు[15:24]
  • మరిన్ని ఆంక్షల దిశగా మహారాష్ట్ర?[13:14]
  • దండకారణ్యంలో దడ[12:40]
  • ఒక్కరోజే 1.45లక్షల మందికి కరోనా[09:53]
  • అంటార్కిటికాలోహిమఫలకానికి ముప్పు[08:00]
  • ఉద్యమ రైతుల్లో కరోనా లేదు![01:19]
  • కరోనా వచ్చింది అతడికి.. నాకు కాదు[01:17]
  • విడాకులు తీసుకుంటే OCI హోదా ఉండదు![01:14]
  • ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌కు కరోనా[13:22]
  • ఆందోళన కల్గిస్తోన్న టీకా కొరత[08:26]
  • రక్తం గడ్డకట్టిన దాఖలాలు ఉన్నాయా..![01:12]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఒక్కటే మాట.. బ్లాక్‌బస్టర్‌
  • రివ్యూ: వకీల్‌ సాబ్‌
  • అలీబాబా.. అరడజను కష్టాలు
  • మూడేళ్ల తర్వాత కూడా అదే పవర్‌ : చిరు
  • ఉద్వేగానికి లోనైన వేణు శ్రీరామ్‌
  • డెత్‌ స్పెషలిస్టు అతడే.. 20 పరుగుల లోటు
  • దొరికిన ఆభరణాల్లో వాటా ఇవ్వాలి
  • పవన్‌ అభిమాని తీరుపై అనసూయ అసంతృప్తి
  • పవన్‌ చూసి నిర్మాతనని మర్చిపోయా: దిల్‌ రాజు
  • విడాకులు తీసుకుంటే OCI హోదా ఉండదు!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.