☰
సోమవారం, మార్చి 01, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 25/01/2021 01:16 IST
దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకం: మోదీ

దిల్లీ: ‘ఏక్‌ భారత్‌- శ్రేష్ఠ భారత్‌’ స్ఫూర్తితో ‘వోకల్‌ ఫర్‌ లోకల్’ కార్యక్రమాన్ని బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. కళాకారులు, ఎన్‌సీసీ క్యాడెట్లతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మోదీ ఈ మేరకు వెల్లడించారు. ‘‘ప్రజలు తాము నిత్య జీవితంలో స్వదేశీ ఉత్పత్తుల ఉపయోగంపై దృష్టి సారించాలి. అదే సమయంలో తమ జీవితాల్లోకి విదేశీ వస్తువులు ఎంత మేర వచ్చాయోనన్న విషయాన్ని పరిశీలించుకోవాలి. ఆయా వస్తువులకు మానసికంగా బానిసలవుతున్నామనే విషయాన్ని మనం గుర్తించాలి. యువత తలచుకుంటే భారత్‌ సులువుగా స్వశక్తి ఆధారిత దేశంగా మారుతుంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ విజయం కూడా దేశ యువతపైనే ఆధారపడి ఉంది’’ అని మోదీ అన్నారు. 

‘‘దేశంలోని శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఎంతో శ్రమించి కరోనా వైరస్‌కు టీకాను రూపొందించి తమ కర్తవ్యాన్ని పూర్తి చేశారు. ఆ టీకాను వేయించుకొని ప్రజలు తమ బాధ్యతను నిర్వర్తించాలి. తప్పుడు ప్రచారాల్ని వ్యాప్తి చేసే వారిని మనం సరైన సమాచారంతో ఓడించాలి. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతం అయ్యేందుకు అందరూ ముందుకు వచ్చి సహకరించాలి. దేశ అభివృద్ధి కోసం ఉన్నతంగా శ్రమించాలి’’ అని మోదీ విజ్ఞప్తి చేశారు. స్థానిక ఆర్థిక వ్యవస్థల్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం వోకల్ ఫర్‌ లోకల్‌ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

ఆత్మనిర్భర్‌ భారత్‌లో యూపీ పాత్ర కీలకం

ఆత్మనిర్భర్‌ భారత్‌ నిర్మాణంలో ఉత్తరప్రదేశ్‌ కీలక పాత్ర పోషిస్తోందని మోదీ పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఈమేరకు ట్వీటర్‌ ద్వారా వెల్లడించారు. ‘ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ నేల సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. ఈ రోజు  ఆత్మనిర్భర్‌ భారత్‌ నిర్మాణంలో రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తోంది’ అని వెల్లడించారు.

ఇదీ చదవండి

చైనా దుశ్చర్యలను తిప్పికొట్టడానికి రంగం సిద్ధం

Tags: జాతీయంnationalmodinarendra modivocal for localindianccyouthcadetsup

మరిన్ని

  • నిర్లక్ష్యం చేస్తే.. మూడో ముప్పు తప్పదు![01:27]
  • వాట్సాప్‌ గ్రూప్‌లకు దూరంగా సుప్రీంకోర్టు![01:18]
  • ​​​​​రైతు చట్టాలు కావవి.. డెత్‌ వారెంట్లు: కేజ్రీవాల్‌[01:08]
  • మోదీ గర్వించదగిన వ్యక్తి: గులాం నబీ ఆజాద్‌[01:29]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఆ యాడ్‌లోని చిన్నారి కృతిశెట్టినే..!
  • బన్నీ సినిమాలో స్టార్‌ హీరో కుమార్తె..?
  • ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
  • సమ్మర్‌ మూడ్‌లో కీర్తి.. బికినీలో బిపాస..
  • భార్య, బిడ్డ బతికితే చాలనుకున్నా!
  • తల్లికాబోతున్న హీరోయిన్‌ రిచా
  • వాహ్‌! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
  • రాళ్లు రువ్వి.. వెంబడించి
  • అలా చేశాక జుట్టు ఊడుతుంది?
  • రేపటి సిరులు
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.