సోమవారం, జులై 13, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

బండి దొంగతనం చేసి..తిరిగి పంపాడు..


కోయంబత్తూరు: లాక్‌డౌన్‌ నేపథ్యంలో కుటుంబంతో సహా ఇంటికి వెళ్లడం కోసం ద్విచక్రవాహనాన్ని దొంగతనం చేసి, తిరిగి దాన్ని యజమానికి పార్శిల్ చేసిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

తమిళనాడులోని కోయంబత్తూర్‌ జిల్లాలో సురేశ్ కుమార్ అనే వ్యక్తికి ఇంజనీరింగ్ టూల్స్‌ తయారు చేసే కంపెనీ ఉంది. రెండు వారాల క్రితం అతడి ద్విచక్రవాహనం దొంగతనానికి గురైంది. దానిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు ఒకవైపు విచారణ చేస్తుండగా.. అతడికి బండి పార్శిల్ వచ్చిందంటూ డెలివరీ సంస్థ నుంచి సమాచారం అందింది. వెళ్లి చూడగా కనిపించకుండా పోయిన వాహనం ఉండటంతో ఆశ్చర్యపోవడం అతడివంతైంది. అయితే సీసీటీవీ పుటేజీ ఆధారంగా దగ్గర్లోని టీషాపులో పనిచేసే వ్యక్తే దాన్ని దొంగలించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సదరు వ్యక్తి లాక్‌డౌన్‌లో ప్రయాణ సౌకర్యం లేకపోవడంతో కుటుంబాన్ని సొంతూరు చేర్చడానికి బండిని దొంగతనం చేసినట్లు తెలిసింది. తంజావూరు జిల్లాలోని తన ఊరు చేరిన తరవాత దాన్ని పార్శిల్ చేశాడు. డెలివరీ సంస్థ ద్వారా ఆ ఊరి పేరు తెలిసింది. అంతేకాకుండా ఆ పార్శిల్ తీసుకొనే వ్యక్తే డబ్బులు చెల్లించేలా పే ఎట్ డెలివరీ విధానంలో దాన్ని తిప్పిపంపాడు. దాంతో యజమాని డబ్బులు చెల్లించి బైక్‌  తీసుకోవాల్సి వచ్చింది. 

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని