☰
సోమవారం, ఏప్రిల్ 19, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 27/02/2021 12:46 IST
కరోనా కలవరం..కారణమేంటి..?

కొత్త రకాలా.. లేక సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లా..

దిల్లీ: దేశంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, చత్తీస్‌గఢ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత పెరుగుతుండటం కలవరపెడుతోంది. కరోనా కొత్త రకాలు ఈ ఉద్ధృతికి కారణమా..?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ వైద్య నిపుణులు మాత్రం సూపర్‌ స్ప్రెడర్ ఈవెంట్లే ఈ వ్యాప్తికి కారణమని అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఓ వార్త సంస్థ నివేదిక వెలువరించింది.

కొత్త రకాలా..ఆధారాల్లేవ్..!

‘కరోనా వైరస్ కొత్త రకాల వల్లే మహారాష్ట్రలో మహమ్మారి మరోసారి విజృంభిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లు ఈ సమూహ వ్యాప్తికి దారితీస్తున్నాయి. బాధితులను గుర్తించేందుకు టెస్టింగ్, ట్రాకింగ్, ట్రేసింగ్‌ విధానాలను తగినమేర అమలు చేయకపోవడం ఈ కేసుల పెరుగుదలకు దోహదం చేస్తోంది’ అని బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్(నిమ్‌హాన్స్‌) రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ వి.రవి వెల్లడించారు. ఆయన కరోనా వైరస్‌ జన్యు నిర్ధారణకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వంలో నోడల్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏ తరహా వైరస్‌లో అయినా ఉత్పరివర్తన సహజమేనని తెలిసిన విషయమే. ఒక్కోసారి అవి వైరస్ పనితీరుపై అంతగా ప్రభావం చూపవు. ఆ మార్పులు వైరస్‌ను బలహీనం చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే కొత్త రకాలు ఆధిపత్యం చెలాయిస్తాయి. రోగనిరోధక శక్తిని దెబ్బతీసి, తమ పునరుత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపర్చుకుంటాయి. కరోనాకు సంబంధించి వెలుగుచూసిన బ్రిటన్, దక్షిణాఫ్రికా రకాలు ఆ కోవకు చెందనవేనని వెల్లడించారు. వైరస్ ఎంతగా దాని స్థానాలను మార్చితే(సర్య్కులేట్) అంతగా ఉత్పర్తివర్తనం చెందుతుందని వారు వెల్లడించారు. 

గతేడాదే గుర్తించాం..

కాగా, కరోనాకు సంబంధించి మనదేశంలో మహారాష్ట్రతో సహా ఇతర రాష్ట్రాల్లో N440K, E484Q వైరస్ కొత్త రకాలను గుర్తించారు. అయితే తమ రాష్ట్రంలో తాజా విజృంభణకు ఈ రెండు రకాలు కారణమని చెప్పలేమని మహారాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. ఈ రెండు రకాలు భారత్‌లో మాత్రమే కనిపించలేదని,  ఇతర దేశాల్లో కూడా వాటిని గుర్తించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. అంతేకాకుండా E484Q రకాన్ని గతేడాది మార్చి, జులైలోనే మహారాష్ట్రలో గుర్తించినట్లు వెల్లడించడం గమనార్హం. అలాగే N440K రకాన్ని గతేడాది మే, సెప్టెంబర్‌లలో 13 సందర్భాల్లో కనుగొన్నట్లు తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అసోంలో దాని ఆనవాలు కనిపించినట్లు చెప్పింది. అయితే ప్రస్తుత పరిస్థితిని పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు కూడా తెలిపింది. 

కాగా, కొత్త సంవత్సరానికి ఈ ప్రపంచం టీకాతో ఆనందంతో స్వాగతం పలకగా..బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి కొత్త రకాలు వెలుగుచూసి ప్రజానీకాన్ని మరోసారి ఆందోళనలోకి నెట్టేశాయి. మనదేశంలో తాజా విజృంభణకు కొత్త రకాలు కారణం కాకపోవచ్చని నిపుణులు చెప్తున్నప్పటికీ..వైరస్ ఎంతగా సర్క్యులేట్ అయితే అంతగా పరివర్తన చెందుతుందని అంటున్నారు. ఆ ఉత్పవరివర్తనాన్ని కట్టడి చేయాలంటే..మాస్కులు ధరించడం, బౌతిక దూరం, పరిశుభ్రత ప్రమాణాలు పాటించాల్సిందేని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇవీ చదవండి

  • కరోనా వైరస్ రకాలను ముందే పసిగట్టొచ్చు!

  • కరోనా కలవరపెడుతోంది

Tags: national newsజాతీయ వార్తలుcoronavirusకరోనావైరస్Indiaభారత్

మరిన్ని

  • ఆ ఆరు రాష్ట్రాలు సున్నితమైనవి![14:34]
  • కొవిడ్‌ విలయం: ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష[13:10]
  • దిల్లీలో ఆరు రోజుల లాక్‌డౌన్‌..[12:08]
  • భారత విమాన రాకపోకలపై హాంకాంగ్‌ నిషేధం[10:59]
  • India Corona: 3లక్షలకు చేరువగా కొత్త కేసులు[09:43]
  • రెమ్‌డెసివిర్‌పై ‘మహా’ జగడం[07:53]
  • టెక్సాస్‌లో కాల్పులు: ముగ్గురి మృతి[02:10]
  • కొవిడ్‌ కట్టడికి మిలటరీ కావాలి: సోరెన్‌[01:21]
  • టీకా పంపిణీకి ఆంక్షలు ఆటంకం కావద్దు![01:19]
  • ఆసక్తి రేకెత్తించిన కేంద్ర మంత్రి ట్వీట్‌[00:06]
  • కరోనాపై ‘ప్యాకేజీ’గా పోరాడకపోతే ఇంతే..![12:04]
  • ఇక oxygen express[08:38]
  • ఈజిప్ట్‌లో ఘోర ప్రమాదం: 11 మంది మృతి [06:32]
  • కొవిడ్‌ ఆంక్షలు: రోజుకు రూ.315కోట్ల నష్టం![01:17]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • Horoscope: ఈ రోజు రాశి ఫలం
  • ఆశ్రయమిచ్చి అక్క, చెల్లెలిని వేధించి..
  • కళ్లలోంచీ వైరస్‌ చొరబాటు
  • మామ అంత్యక్రియలకు వచ్చి అల్లుడి మృతి..
  • విలియమ్సన్‌కు ఏమైంది?
  • India Corona: 3లక్షలకు చేరువగా కొత్త కేసులు
  • కృత్రిమ కాలితో.. లైసెన్సు లేకుండా డ్రైవింగ్‌
  • Weight Loss: చాలామంది చేస్తున్న తప్పులివే!
  • దిల్లీలో ఆరు రోజుల లాక్‌డౌన్‌..
  • కరోనాపై ‘ప్యాకేజీ’గా పోరాడకపోతే ఇంతే..!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.