☰
సోమవారం, మార్చి 01, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 22/01/2021 11:57 IST
క్షీణించిన శశికళ ఆరోగ్యం

బెంగళూరు: శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నునొప్పితో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చేరిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు తెలిపారు.  బెంగళూరులోని బౌరింగ్‌ ఆసుపత్రిలో ఆమెకు తొలుత రెండుసార్లు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది. ఆ ఆసుపత్రిలో సీటీ స్కాన్‌ లేకపోవడంతో అక్కడి నుంచి ఆమెను విక్టోరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చేసిన సీటీ స్కాన్‌ పరీక్షలో ఆమెకు కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో పాటు రక్తపోటు, మధుమేహం సమస్యలు కూడా ఉన్నాయి. శశికళ ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్టు విక్టోరియా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని, ఆమె ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు.

శశికళ కారాగార వాసం మరి కొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నెల 27న ఉదయం ఆమె జైలు నుంచి విడుదల కాబోతున్నారని శశికళ తరఫు న్యాయవాది రాజా సెతురపాండియన్‌ ఇటీవల వెల్లడించారు. 2016లో జయలలిత మరణానంతరం అక్రమాస్తుల కేసులో ఆమె అరెస్టయిన విషయం తెలిసిందే. దీంతో నాలుగేళ్లుగా ఆమె బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.10కోట్లు జరిమానా చెల్లించి ఏడాది ముందుగానే విడుదల కాబోతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్న వేళ ఆమె జైలునుంచి విడుదల కావడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ తరుణంలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఇవీ చదవండి..

అంతుచిక్కని కారణాలతో పలువురికి అస్వస్థత

శివమొగ్గలో భారీ పేలుడు.. 8 మంది మృతి


Tags: sasikalaశశికళcovid-19కొవిడ్‌ 19tamilnaduతమిళనాడు

మరిన్ని

  • నిర్లక్ష్యం చేస్తే.. మూడో ముప్పు తప్పదు![01:27]
  • వాట్సాప్‌ గ్రూప్‌లకు దూరంగా సుప్రీంకోర్టు![01:18]
  • ​​​​​రైతు చట్టాలు కావవి.. డెత్‌ వారెంట్లు: కేజ్రీవాల్‌[01:08]
  • మోదీ గర్వించదగిన వ్యక్తి: గులాం నబీ ఆజాద్‌[01:29]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఆ యాడ్‌లోని చిన్నారి కృతిశెట్టినే..!
  • బన్నీ సినిమాలో స్టార్‌ హీరో కుమార్తె..?
  • ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
  • సమ్మర్‌ మూడ్‌లో కీర్తి.. బికినీలో బిపాస..
  • భార్య, బిడ్డ బతికితే చాలనుకున్నా!
  • తల్లికాబోతున్న హీరోయిన్‌ రిచా
  • వాహ్‌! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
  • రాళ్లు రువ్వి.. వెంబడించి
  • అలా చేశాక జుట్టు ఊడుతుంది?
  • రేపటి సిరులు
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.