☰
బుధవారం, ఏప్రిల్ 14, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 08/03/2021 14:38 IST
రాజకుటుంబంలోకి వచ్చాక చచ్చిపోదామనుకున్నా!

తోడికోడలు కేట్‌ వల్ల ఏడ్చా

సంచలన విషయాలు వెల్లడించిన ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ దంపతులు

న్యూయార్క్‌: ‘‘ప్రిన్స్‌ హ్యారీని పెళ్లి చేసుకుని బ్రిటన్‌ రాజకుటుంబంలోకి అడుగుపెట్టాక ఎన్నో ఇబ్బందులు పడ్డా. మానసిక సమస్యలతో బాధపడుతుంటే కుటుంబంలో ఎవరూ సాయం చేయలేదు సరికదా.. నాపై నిందలు వేశారు. వీటివల్ల ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయి’’ అంటూ హ్యారీ సతీమణి మేఘన్‌ మార్కెల్‌ భావోద్వేగానికి గురయ్యారు. రాజకుటుంబం నుంచి విడిపోయిన ఈ దంపతులు తొలిసారిగా ఓ టీవీ షోలో మాట్లాడారు. అమెరికాలోని పాపులర్‌ టీవీ షో ఓఫ్రా విన్ఫ్రే కార్యక్రమానికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన వీరు.. సంచలన విషయాలు వెల్లడించారు. 

చచ్చిపోదామనకున్నా..

‘‘హ్యారీని పెళ్లి చేసుకోకముందు రాచరికపు జీవితం గురించి నాకు ఏమాత్రం తెలియదు. రాణి ముందు ఎలా ఉండాలి అనేది కూడా అవగాహన లేదు. హ్యారీతో వివాహం అయిన తొలినాళ్లలో ఈ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. ప్యాలెస్‌లోకి వచ్చాక ఇలా ఉండాలి అలా చేయాలంటూ అనేక ఆంక్షలు ఉండేవి. దీంతో ఒక్కోసారి చాలా ఒంటరిగా అనిపించేది. నెలల తరబడి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో చీకట్లో ఉన్నట్లు అనిపించేది. అలా మానసికంగా ఎంతో వేదన అనుభవిస్తున్నా.. రాజకుటుంబంలో ఒక్కరు కూడా నాకు సాయం చేయలేదు. పైగా నాపై అసత్య ఆరోపణలు చేశారు. నిందలు వేశారు. వీటన్నింటినీ చూసి ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. రాజకుటుంబంలో నాకు రక్షణ ఉండదని పెళ్లి అయిన కొద్దిరోజులకే అర్థమైంది’’ మేఘన్‌ చెప్పారు. 

కొడుకు రంగు గురించి భయపడ్డారు..

‘‘నేను గర్భవతిగా ఉన్న సమయంలో పుట్టబోయే బిడ్డ రంగు గురించి కుటుంబంలో చర్చ జరిగింది. నేను నల్లగా ఉన్నాను కాబట్టి.. నా బిడ్డ ఆర్చీ కూడా నల్లగానే పుడతాడని వారు ఆందోళన చెందారు. దీని గురించి హ్యారీతో వారు చర్చించారు. అంతేగాక, మా బిడ్డకు భద్రత ఉండదని, టైటిల్‌ కూడా రాదని మాట్లాడుకున్నారు’’ అని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. 

కేట్‌ వల్ల ఏడ్చా..

‘‘రాజకుటుంబంతో నాకు సఖ్యత లేదని, నా వల్ల తోడికోడలు కేట్‌ ఏడ్చిందని గతంలో వార్తలు వచ్చాయి. అవన్నీ నిజం కాదని కుటుంబంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. నిజానికి దీనికి పూర్తి భిన్నంగా జరిగింది. పెళ్లి రోజున ఫ్లవర్‌ గర్ల్‌ దుస్తుల విషయంలో కేట్‌ కాస్త అసంతృప్తికి గురయ్యారు. ఆ విషయం తెలిసి నేను చాలా బాధపడ్డా. ఏడ్చా. అయితే, ఆ తర్వాత కేట్‌ క్షమాపణలు చెప్పడంతో ఆ సమస్య సద్దుమణిగింది. కానీ బయట మాత్రమే నా వల్లే తప్పు జరిగినట్లు ప్రచారం జరిగింది’’ అని మేఘన్‌ తెలిపారు. 

మూడు రోజుల ముందే రహస్య పెళ్లి..

‘‘2018 మే 19న బ్రిటన్‌ విండ్సోర్‌ క్యాస్టిల్‌లో అధికారికంగా మా వివాహం జరిగింది. అయితే, అంతకంటే మూడు రోజుల ముందే ప్రైవేటుగా మేం పెళ్లి చేసుకున్నాం. ఈ విషయం ఎవరికీ తెలియదు. మా కోసం మేం ఆ వేడుక చేసుకున్నాం’’ అని మేఘన్‌ చెప్పుకొచ్చారు.

డబ్బులు ఇవ్వడం ఆపేశారు..

ఈ సందర్భంగా ప్రిన్స్‌ హ్యారీ కూడా పలు సంచలన విషయాలు వెల్లడించారు. తను కేవలం మేఘన్‌ కోసమే రాజకుటుంబం నుంచి బయటకు రాలేదని హ్యారీ తెలిపారు. ‘‘నన్ను ట్రాప్‌ చేశారు. నాకు ఆ విషయం తెలియలేదు. అందులో నుంచి ఎలా బయటపడాలో కూడా అర్థం కాలేదు. నా తండ్రి, సోదరుడిని కూడా ట్రాప్‌ చేశారు’’ అని అన్నారు. రాచరిక విధుల నుంచి వెనక్కి తగ్గుతున్నాం అని ప్రకటించిన తర్వాత 2020 ఆరంభంలో రాజకుటుంబం నుంచి డబ్బులు రావడం ఆగిపోయాని ఆయన తెలిపారు. ఆ సమయంలో తన తల్లి ప్రిన్సెస్‌ డయానా తన కోసం వదిలివెళ్లిన డబ్బులతో తన కుటుంబానికి భద్రత ఇవ్వగలిగానని చెప్పుకొచ్చారు. 

‘‘నా తండ్రి ప్రిన్స్‌ ఛార్లెస్‌, సోదరుడు ప్రిన్స్‌ విలియంతో సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. పెళ్లి తర్వాత కుటుంబంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నేనెప్పుడూ నా కొడుకుకు రాజకుటుంబలో హోదా రావాలని కోరుకోలేదు. దాని గురించి ఎవరితోనూ చర్చించలేదు. అయినా, సరే మాపై దుష్ప్రచారం జరిగింది. నా తల్లి జీవితంలో జరిగినట్లుగానే నా జీవితంలోనూ జరుగుతుందేమోనని భయపడ్డా. నిస్సహాయ స్థితిలోనే రాజకుటుంబం నుంచి విడిపోదామని నిర్ణయానికి వచ్చా. ఆ ప్రకటన చేసిన తర్వాత కుటుంబం నుంచి వచ్చే డబ్బులు ఆగిపోయాయి. తండ్రి తనతో మాట్లాడటం మానేశారు. నన్ను నమ్ముకుని వచ్చిన భార్య, కొడుకు ఆర్చీ భవిష్యత్‌ కోసమే బయటకు వచ్చేశా’’ అని హ్యారీ వెల్లడించారు. 

అమ్మాయి వచ్చేస్తోంది..

ఈ సందర్భంగా హ్యారీ దంపతులు ఓ శుభవార్త పంచుకున్నారు. త్వరలో తమకు ఆడపిల్ల పుట్టబోతోందని చెప్పారు. ఈ ఏడాది వేసవిలో తాను అమ్మాయికి జన్మనివ్వబోతున్నానని మేఘన్‌ సంతోషంగా చెప్పారు. 

బ్రిటన్‌ రాణి ఎలిజబిత్‌ 2 మనవడు అయిన ప్రిన్స్‌ హ్యారీ.. 2018లో అమెరికా నటి మేఘన్‌ మర్కెల్‌ను వివాహం చేసుకున్నారు. 2019లో వీరికి కుమారుడు ఆర్చీ పుట్టాడు. అయితే కుటుంబంతో విభేదాల కారణంగా గతేడాది హ్యారీ దంపతులు రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేశారు. వారు ఆ తర్వాత మేఘన్‌ స్వస్థలం కాలిఫోర్నియా వెళ్లిపోయారు. 

ఇవీ చదవండి

  • చైనా-భారత్‌ మిత్రదేశాలు: వాంగ్‌ యీ

  • భారత్‌పై సైబర్‌ దాడి.. స్పందించిన చైనా!

Tags: International Newsఅంతర్జాతీయ వార్తలుPrince Harryప్రిన్స్ హ్యారీMeghan Markelమేఘన్‌ మార్కెల్‌

మరిన్ని

  • దిల్లీలో ఒక్కరోజే 100కిపైగా మృత్యువాత[22:48]
  • కొవిడ్‌ సూపర్‌ స్ప్రెడర్స్‌ అవే: ఎన్‌టీఏజీ[21:59]
  • రెమిడెసివిర్‌ ఔషధ ఉత్పత్తిని పెంచండి![21:28]
  • మంచి నిర్ణయం తీసుకున్నారు మోదీజీ: కాంగ్రెస్[21:06]
  • మహారాష్ట్రను కలవరపెడుతోన్న ‘డబుల్‌ మ్యుటేషన్‌’![20:34]
  • మోడెర్నా టీకా: 6 నెలలైనా అదే సామర్థ్యం![20:22]
  • 2 లక్షల కరోనా కేసుల దిశగా భారత్![18:50]
  • కుంభమేళా నేటితో ముగింపు..?[18:29]
  • జనతా కర్ఫ్యూ: కిక్కిరిసిన రైల్వేస్టేషన్లు[17:22]
  • ‘తిహాడ్‌’లో కరోనా.. ఆందోళనలో అధికారులు[17:13]
  • సీబీఐ ముందు హాజరైన అనిల్‌ దేశ్‌ముఖ్‌![15:35]
  • సచిన్ వాజే కేసులో కొత్త ట్విస్ట్‌..![15:22]
  • గుట్టలుగా మృతదేహాలు.. ఖాళీలేని శ్మశానాలు![14:58]
  • CBSE పరీక్షలు: ‘10’ రద్దు.. ‘12’ వాయిదా[14:09]
  • భాగ్‌ మానవా భాగ్‌..![13:51]
  • యూపీ సీఎం.. మాజీ సీఎంకు కరోనా[13:36]
  • కరోనారోగుల దుస్థితి.. వీడియో షేర్‌చేసిన భజ్జీ[12:31]
  • భజనలో రూ.2.5 కోట్లు కుమ్మరించిన భక్తులు[12:20]
  • ఇజ్రాయెల్..‌ అందుకో టీకా ఫలం‌![11:53]
  • CBSE పరీక్షలపై మోదీ కీలక భేటీ[11:44]
  • పాక్‌ రెచ్చగొడితే.. భారత్‌ స్పందన గట్టిగానే[11:10]
  • ఐపీఎల్‌ కోసం ఖైదీల నిరాహార దీక్ష[10:49]
  • భారత్‌లో కరోనా : ఒక్కరోజే వెయ్యికిపైగా మరణాలు[09:54]
  • అంబేడ్కర్‌ ఆలోచనలు ఎందరికో స్ఫూర్తి: రాష్ట్రపతి[09:30]
  • ఎవర్‌ గివెన్‌ నౌకకు 100 కోట్ల డాలర్ల జరిమానా[06:44]
  • స్పుత్నిక్‌-వి టీకాకు డీసీజీఐ ఆమోదం![01:12]
  • సెలబ్రిటీల తీరుతో ఆస్పత్రుల్లో పడకల కొరత[01:07]
  • అటవీ జంతువుల విక్రయాలు ఆపండి: WHO[01:02]
  • మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ ఉండదు: ఉద్ధవ్‌[01:17]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • బుల్లితెర జలపాతంలో సుధీర్‌, రష్మి
  • మూఢ విశ్వాసంతో కన్నబిడ్డలనే కడతేర్చే యత్నం
  • ‘ప్రియుడి ఒత్తిడితోనే కుమార్తె ఆత్మహత్య’
  • ఇజ్రాయెల్..‌ అందుకో టీకా ఫలం‌!
  • మార్కెట్లలో జోష్‌ నింపిన కేంద్రం నిర్ణయం
  • పదేళ్లకే నాకు పెళ్లి చేశారు: నటి కృష్ణవేణి
  • సెకండ్‌ వేవ్‌.. చిత్రసీమపై కరోనా ప్రతాపం
  • గుట్టలుగా మృతదేహాలు.. ఖాళీలేని శ్మశానాలు!
  • ఐపీఎల్‌ నుంచి స్టోక్స్‌ ఔట్‌
  • రోహిత్‌ నమ్మాడు.. రాహులే వికెట్లు తీశాడు
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.