☰
గురువారం, మార్చి 04, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 16/01/2021 13:54 IST
20లక్షలు దాటిన కరోనా మరణాలు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 20లక్షలు దాటింది. జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం శుక్రవారానికే మరణాలు 20 లక్షలు దాటిపోయాయి. వుహాన్‌లో తొలిమరణం నమోదైన సరిగ్గా ఏడాది తర్వాత ఈ సంఖ్య నమోదు కావడం గమనార్హం. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 20 లక్షలు కేవలం అధికారికంగా నమోదు చేసిన మరణాలేనని.. లెక్కలోని రానివి ఇంకా చాలా ఉంటాయని భావిస్తున్నారు. లక్షణాలు లేకుండా మరణించినవారు.. ఇళ్లలోనే పరీక్షలు చేయించుకోకుండా చనిపోయిన వారు ఇంకా చాలా మందే ఉంటారని అంచనా.

ఇంకా చాలా దేశాల్లో వైరస్‌ నిర్ధారణ పరీక్షలు సమర్థంగా జరగడం లేదని నిపుణులు తెలిపారు. ఈ నేపథ్యంలో లెక్కలోకి రాని మరణాలు నమోదైన వాటికంటే 20శాతం అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈక్వెడార్‌, పెరు, రష్యా వంటి దేశాల్లో మృతుల సంఖ్య అధికారిక లెక్కల కంటే 300-500 శాతం అధికంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమవడం ఊరట కలిగిస్తోంది. అయితే, ప్రతిఒక్కరికీ టీకా అందేందుకు కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. మరోవైపు కొన్ని దేశాల్లో మహమ్మారి వ్యాప్తి మరోసారి తీవ్రరూపం దాల్చడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా, జర్మనీ, స్వీడన్‌, ఇండోనేసియా, ఇజ్రాయెల్‌, జపాన్‌ దేశాలు కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత అత్యంత దుర్భర దినాల్ని గత వారమే చవిచూడడం విచారకర విషయం. అలాగే క్రమంగా మరణాల రేటు సైతం పెరుగుతూ రావడం గమనార్హం. తొలి మిలియన్‌ మరణాలు నమోదు కావడానికి ఎనిమిది నెలలు పట్టగా.. తర్వాతి మిలియన్‌ కేవలం నాలుగు నెలల్లోనే రికార్డయింది. జాన్స్‌ హాప్‌కిన్స్‌ లెక్కల ప్రకారం.. శనివారం ఉదయం 9:30 గంటల సమయానికి ప్రపంచవ్యాప్తంగా 20,08,237 మరణాలు నమోదయ్యాయి. 

దేశం        మరణాలు           కేసులు

అమెరికా     3,91,922        2,35,20,563  
బ్రెజిల్       2,08,246         83,93,492
భారత్‌       1,51,918        1,05,27,683
మెక్సికో      1,37,916         15,88,369    
యూకే       87,448         33,25,642
ఇటలీ        81,325         23,52,423
ఫ్రాన్స్‌        70,090        29,31,396
రష్యా         63,558        34,83,531

ఇవీ చదవండి..

ఇలా వైరస్‌ను గుర్తిస్తుంది.. అలా దాడి చేస్తుంది

నేడే టీకాకు శ్రీకారం


Tags: International Newsఅంతర్జాతీయ వార్తలుCoronavirusకరోనా వైరస్‌Corona Deathsకరోనా మరణాలుJohns Hopkins Universityజాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం

మరిన్ని

  • సైనిక మరణాలపై సందేహం.. బ్లాగర్‌పై చైనా వేటు![01:35]
  • భారత్‌పై సైబర్‌ దాడి.. స్పందించిన చైనా![01:33]
  • ఇకపై అక్కడ మాస్క్‌ తప్పనిసరికాదు!  [01:22]
  • చంద్రుడిపైకి ఫ్రీ ట్రిప్‌.. జపాన్‌ సంపన్నుడి ఆఫర్‌![01:16]
  • ‘కొవాగ్జిన్’‌ క్లినికల్‌ సామర్థ్యం 81%[17:40]
  • గత్యంతరం లేకే కాల్పుల విరమణకు అంగీకారం![17:12]
  • రాహుల్ మాటలకు నవ్వొస్తోంది: జావడేకర్[16:44]
  • పాక్‌ ఉగ్రవాదాన్ని ఎండగట్టిన భారత్‌[15:38]
  • 24×7.. ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చు[14:40]
  • బాధితురాలిని పెళ్లి చేసుకోవాలని రేపిస్టును అడగడమా![14:22]
  • ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే.. దేశద్రోహం  అనలేం[12:53]
  • టీకా ఉత్పత్తి పెంచాలి: బైడెన్‌[12:12]
  • ఆ గ్రామంలో తొలిసారి వెలిగిన విద్యుత్‌ దీపాలు![12:03]
  • మహిళా నేతలు.. ఇచ్చిన మాట తప్పరు![10:11]
  • బైడెన్‌ సహాయకుడిగా భారతీయుడు[09:23]
  • టీకా ఉత్పత్తిలో అంతర్జాతీయ స్థాయికి భారత్‌​​​​​​​[08:52]
  • విలయ వి‘చిత్రం’![07:31]
  • కన్నడనాట మంత్రి రాసలీలల సీడీ ప్రకంపన![06:49]
  • ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్‌ ధర ₹50  [01:33]
  • అంతరిక్షంలో అత్యాధునిక హోటల్‌![01:28]
  • పబ్జీ గేమ్ ఆ కోవకు చెందినదే: జావడేకర్[01:24]
  • బైడెన్..భారత్‌కు అండగా ఉండండి[01:23]
  • ప్రైవేట్‌ ఉద్యోగాల్లో 75% కోటాకు హరియాణా గవర్నర్ ఓకే![01:22]
  • హెచ్‌-1బి వీసాలపై తేలని స్పష్టత[01:16]
  • ఇంటి దగ్గర టీకా తీసుకున్న కర్ణాటక మంత్రి[00:05]
  • ప్రతిభావంతులకు మెండుగా అవకాశాలు: మోదీ[19:00]
  • మయన్మార్‌: సైన్యం కాల్పుల్లో 9మంది మృతి[18:40]
  • కొవిడ్‌ టీకా వేయించుకున్న రాష్ట్రపతి[14:07]
  • తాప్సీ, అనురాగ్‌ కశ్యప్‌ నివాసాల్లో ఐటీ సోదాలు[13:22]
  • ఆ దేశంలో ఒకే రోజు 1,641 మంది మృతి[12:37]
  • నీరా టాండన్ నియామకంపై  బైడెన్‌ వెనక్కి[11:33]
  • భాజపా ఎంపీ కుమారుడి కాల్పుల నాటకం..![10:40]
  • సీరం నుంచి బ్రిటన్‌కు కోటి డోసులు![01:13]
  • రెండోరోజు వందలోపు మరణాలు[10:31]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • నమ్మించి మోసం చేశారు: జయలలిత
  • శశికళ సంచలన నిర్ణయం
  • డ్యాన్స్‌తో శ్రీదేవిని గుర్తు చేసిన జాన్వీ..!
  • రాశీఖన్నా వింతకోరిక.. సారా డైలీడోస్‌
  • గంటా స్పందనపై విజయసాయిరెడ్డి కౌంటర్‌
  • నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది రాబోయే సినిమాలివే..
  • ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేయనున్న ప్రభాస్‌..!
  • హీరోయిన్స్‌ కాదు కానీ.. నెట్టింట్లో స్టార్సే
  • గత్యంతరం లేకే కాల్పుల విరమణకు అంగీకారం!
  • ఇంట్లో తెలిసిపోతుందనే డిగ్రీ విద్యార్థిని ‘కట్టు’కథ
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.