చేయి తిరిగిన కళాకారుడి కుంచె నుంచి జాలువారిన చిత్రరాజంలా ఉన్న ఈ దృశ్యం నిజానికి ఓ విలయానికి సంబంధించినది. ఇండోనేసియాలోని సినాబంగ్ అగ్నిపర్వతం మంగళవారం బద్దలవడంతో బూడిద ఇలా సుమారు 5,000 మీటర్ల (16,400 అడుగుల) ఎత్తున వ్యాపించింది. సరిగ్గా ఆ సమయంలో కెమెరా క్లిక్‌మనిపించడంతో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఇప్పటికే 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో తాజాగా పెద్ద ఇబ్బందులేమీ ఎదురవలేదు. విమాన రాకపోకలకూ అంతరాయాలు ఏర్పడలేదని అధికారులు తెలిపారు.