☰
సోమవారం, మార్చి 01, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 25/01/2021 01:22 IST
‘మీరు చెప్తే వింటారు’.. మోదీ తల్లికి రైతు లేఖ!

ఇంటర్నెట్‌డెస్క్‌: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు పెద్దఎత్తున ఆందోళన చేస్తుండగా.. మరోవైపు ఓ రైతు మాత్రం చట్టాల రద్దు కోరుతూ ప్రధాని మోదీ తల్లికి లేఖ రాశారు. ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని తన కుమారుడికి చెప్పాలని కోరారు. ఈ మేరకు మోదీ తల్లి హీరాబెన్‌కు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లాకు చెందిన హర్‌ప్రీత్‌ సింగ్‌ అనే రైతు లేఖ రాశారు.

‘‘అమ్మా.. బరువెక్కిన హృదయంతో ఈ లేఖ రాస్తున్నా. ఈ దేశానికి, ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతన్నలు సాగు చట్టాల రద్దు కోరుతూ దిల్లీ రోడ్లపై ఆందోళన చేస్తున్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కొందరు అనారోగ్యం పాలవగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. తోటి రైతులు ప్రాణాలు కోల్పోవడం బాధిస్తోంది. మీ కుమారుడైన ప్రధాని నరేంద్రమోదీకి ఆ రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పండి. ఎవరు చెప్పినా వినకపోవచ్చు గానీ, మీరు చెప్తే తప్పక వింటారన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతో ఎంతో ఆశగా ఈ లేఖ రాస్తున్నా’’ అని హర్‌ప్రీత్‌సింగ్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి..
ముంబయికి వేల మంది రైతుల కవాతు
దిల్లీలో ట్రాక్టర్‌ ర్యాలీకి రైతుల సన్నాహాలు

Tags: national newsజాతీయ వార్తలుfarmerరైతుPM Modiప్రధాని మోదీmotherలేఖHeerabenహీరాబెన్‌farm lawsవ్యవసాయ చట్టాలు

మరిన్ని

  • నిర్లక్ష్యం చేస్తే.. మూడో ముప్పు తప్పదు![01:27]
  • వాట్సాప్‌ గ్రూప్‌లకు దూరంగా సుప్రీంకోర్టు![01:18]
  • ​​​​​రైతు చట్టాలు కావవి.. డెత్‌ వారెంట్లు: కేజ్రీవాల్‌[01:08]
  • మోదీ గర్వించదగిన వ్యక్తి: గులాం నబీ ఆజాద్‌[01:29]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఆ యాడ్‌లోని చిన్నారి కృతిశెట్టినే..!
  • బన్నీ సినిమాలో స్టార్‌ హీరో కుమార్తె..?
  • సమ్మర్‌ మూడ్‌లో కీర్తి.. బికినీలో బిపాస..
  • ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
  • తల్లికాబోతున్న హీరోయిన్‌ రిచా
  • భార్య, బిడ్డ బతికితే చాలనుకున్నా!
  • వాహ్‌! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
  • రాళ్లు రువ్వి.. వెంబడించి
  • అలా చేశాక జుట్టు ఊడుతుంది?
  • రేపటి సిరులు
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.