☰
సోమవారం, మార్చి 01, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 22/01/2021 15:23 IST
కేంబ్రిడ్జి అనలిటికాపై సీబీఐ కేసు

దిల్లీ: ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ కేంబ్రిడ్జి అనలిటికా, గ్లోబల్‌ సైన్స్‌ రీసెర్చి లిమిటెడ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శుక్రవారం కేసు నమోదు చేసింది. భారత్‌కు చెందిన ఫేస్‌బుక్‌ వినియోగదారుల సమాచారాన్ని అక్రమంగా సేకరించినందుకు గానూ కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. గ్లోబల్‌ సైన్స్‌ రీసెర్చి 2014లో ‘దిస్‌ ఈజ్‌ యువర్‌ డిజిటల్‌ లైఫ్‌’ (this is your digital life) అనే యాప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పరిశోధన, విద్యా సంబంధిత అవసరాల కోసం తన వినియోగదారుల సమాచారాన్ని సేకరించేందుకునేందుకు గ్లోబల్‌ రీసెర్చికి ఫేస్‌బుక్‌ అనుమతినిచ్చింది. తర్వాత ఈ డేటాను వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకునేందుకు గ్లోబల్‌ రీసెర్చితో కేంబ్రిడ్జి అనలిటికా అక్రమంగా ఒప్పందం కుదుర్చుకుంది.

ఇలా అక్రమంగా కేంబ్రిడ్జి అనలిటికా చేతుల్లోకి సమాచారం వెళ్లిన విషయం తొలిసారి 2018లో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌.. ప్రపంచవ్యాప్తంగా 87 మిలియన్ల మంది యూజర్ల సమాచారం అక్రమంగా కేంబ్రిడ్జి అనలిటికా చేతుల్లోకి వెళ్లి ఉండొచ్చని అంగీకరించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం.. ఈ విషయంపై వివరణ కోరుతూ ఫేస్‌బుక్‌, కేంబ్రిడ్జి అనలిటికాకు నోటీసులు జారీ చేసింది. 2018లో కేంబ్రిడ్జి అనలిటికా ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమెరికాతో పాటు అనేక దేశాల ఎన్నికల్లో ఇది కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వచ్చాయి. 2016 అమెరికా ఎన్నికల్లో రాజకీయ సహాయ సంస్థ కేంబ్రిడ్జి అనలిటికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌నకు అనుకూలంగా పనిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 

ఈ అక్రమాలను తొలిసారి క్రిస్టోఫర్‌ విలీ అనే వ్యక్తి వెలుగులోకి తెచ్చారు. ఇది పూర్తిగా వ్యక్తుల గోప్యతా నిబంధనల్ని ఉల్లంఘించడమేనని తెలిపారు. అలాగే, ఈ డేటాను ఓటర్లను ప్రభావితం చేసేందుకు, తప్పుడు సమాచారాన్ని జొప్పించేందుకు వినియోగిస్తున్నారని వెల్లడించారు. 2003 నుంచే ఈ సంస్థ భారత ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోందని విలీ ఆరోపించారు. భారతదేశంలో భాజపా, కాంగ్రెస్ పార్టీలు తమ సేవలను ఉపయోగించుకున్నాయని వివాదాస్పద కేంబ్రిడ్జి అనలిటికా అప్పట్లో ప్రకటించింది. దీన్ని ఆధారంగా చేసుకొని కేంద్ర ఐటీ శాఖ.. ఫేస్‌బుక్‌, కేంబ్రిడ్జి అనలిటికాకు నోటీసులు జారీ చేసి దర్యాప్తు చేపట్టింది. ఆరోపణలు నిజమేనని ప్రాథమిక విచారణలో తేలడంతో తాజాగా కేసు నమోదు చేసింది.

ఇవీ చదవండి...

ఈ పని చేస్తే.. మస్క్‌ రూ.730 కోట్లు ఇస్తారట!

కరోనాపై యుద్ధంలో బైడెన్‌ అస్త్రాలివే..!


Tags: National Newsజాతీయ వార్తలుCambridge Analyticaకేంబ్రిడ్జి అనలిటికాFacebookఫేస్‌బుక్‌CBIసీబీఐGlobal Science Research Limitedగ్లోబల్‌ సైన్స్‌ రీసెర్చి లిమిటెడ్‌

మరిన్ని

  • నిర్లక్ష్యం చేస్తే.. మూడో ముప్పు తప్పదు![01:27]
  • వాట్సాప్‌ గ్రూప్‌లకు దూరంగా సుప్రీంకోర్టు![01:18]
  • ​​​​​రైతు చట్టాలు కావవి.. డెత్‌ వారెంట్లు: కేజ్రీవాల్‌[01:08]
  • మోదీ గర్వించదగిన వ్యక్తి: గులాం నబీ ఆజాద్‌[01:29]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఆ యాడ్‌లోని చిన్నారి కృతిశెట్టినే..!
  • బన్నీ సినిమాలో స్టార్‌ హీరో కుమార్తె..?
  • సమ్మర్‌ మూడ్‌లో కీర్తి.. బికినీలో బిపాస..
  • ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
  • తల్లికాబోతున్న హీరోయిన్‌ రిచా
  • వాహ్‌! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
  • భార్య, బిడ్డ బతికితే చాలనుకున్నా!
  • రాళ్లు రువ్వి.. వెంబడించి
  • అలా చేశాక జుట్టు ఊడుతుంది?
  • రేపటి సిరులు
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.