☰
గురువారం, ఫిబ్రవరి 25, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 16/01/2021 15:10 IST
టీకా వేయించుకున్న సీరమ్‌ అధినేత

పుణె: కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టే బృహత్తర కార్యక్రమం మొదలైంది. దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ప్రారంభించారు. తొలిరోజు.. కరోనాపై పోరులో ముందున్న ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు ఆయా రాష్ట్రాల్లో టీకాలు వేస్తున్నారు. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి దేశానికి తొలి టీకా అందించిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అధినేత అదర్‌ పూనావాలా కూడా నేడు టీకా తీసుకున్నారు. 

ఈ విషయాన్ని అదర్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమంలో ప్రధాని మోదీ, యావత్‌ భారతావని విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఈ చారిత్రక ఘట్టంలో ‘కొవిషీల్డ్‌’ కూడా భాగస్వామికావడం నాకు మరింత గర్వంగా ఉంది. టీకా భద్రత, సమర్థతపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగించేందుకు ఆరోగ్య కార్యకర్తలతో పాటు నేను కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నా’ అని పేర్కొన్నారు. టీకా తీసుకున్న వీడియోను ఆయన పంచుకున్నారు. 

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారుచేసిన ‘కొవిషీల్డ్‌’ అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. టీకా పంపిణీ కోసం కేంద్రం.. సీరం సంస్థ నుంచి 1.1 కోట్ల డోసులను ఆర్డర్‌ చేసింది. ఇక మరో సంస్థ భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన ‘కొవాగ్జిన్‌’ అత్యవసర వినియోగానికి కూడా కేంద్రం ఆమోదముద్ర వేసింది. 

దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో నేటి నుంచి టీకా పంపిణీ ప్రారంభమైంది. తొలి రోజు 3లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా వేయనున్నారు. టీకా పంపిణీ ప్రారంభం సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. విదేశాలతో పోలిస్తే భారత్‌లో వ్యాక్సిన్‌ ధరలు చౌకగా ఉన్నాయని తెలిపారు. 

ఇవీ చదవండి..

అతిపెద్ద వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రారంభం

కన్నీటిపర్యంతమైన మోదీ


Tags: National Newsజాతీయ వార్తలుCorona Vaccineకరోనా వ్యాక్సిన్‌Adar Poonawallaఅదర్‌ పూనావాలాSerum Institute Of Indiaసీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాCovishieldకొవిషీల్డ్‌Vaccination Driveటీకా పంపిణీ

మరిన్ని

  • సామాజిక మాధ్యమాలు చట్టాలకు లోబడి ఉండాలి[20:38]
  • మూడో డోసుపై ప్రయోగాలు ప్రారంభించిన ఫైజర్‌[20:17]
  • ముకేశ్‌ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కలకలం![19:46]
  • కాల్పుల విరమణకు కట్టుబడతాం[19:37]
  • రూ.100 టిక్కెట్‌తో ₹ కోటి గెలుచుకుంది![19:23]
  • రైతులతో ఎప్పుడైనా చర్చలకు సిద్ధమే: తోమర్‌[18:31]
  • ఆకాశానికి పెట్రో ధరలు: ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై సీఎం!  [17:53]
  • సర్జికల్‌ స్ట్రైక్స్‌ అందుకే..![17:43]
  • సోషల్‌ మీడియాకు ఇక కొత్త నియమావళి..![16:55]
  • భారత్‌కు నీరవ్‌ మోదీని అప్పగించండి[16:41]
  • టూల్‌కిట్‌ కేసు: శంతనుకు అరెస్టు నుంచి రక్షణ[16:29]
  • దాత అవయవం నుంచి కరోనా: మహిళ మృతి![15:43]
  • విదర్భ కేంద్రంగా వైరస్‌ ఉద్ధృతి![13:58]
  • ఒకే హాస్టల్‌లో 190 మందికి కరోనా![12:08]
  • ఇక మీడియాకు ఫేస్‌బుక్‌ డబ్బు చెల్లించాల్సిందే![10:11]
  • అంగారకుడిపైకి రహస్య సందేశం![09:57]
  • డాలరు చదువు.. ఇక రూపాయల్లో! [09:36]
  • ఐపీఎస్‌ అధికారిణికి లైంగిక వేధింపులు..[02:04]
  • ‘మాస్క్‌ అక్కర్లేదు.. వచ్చేయండి!’[01:56]
  • ‘నమ్మకం’ అనే కోటాలో అంతరిక్షానికి యువతి![01:56]
  • ఆ రాష్ట్రాల వారికి కొవిడ్‌ నెగెటివ్‌ తప్పనిసరి[01:43]
  • ఆ ప్రతిపాదనకు ఒప్పుకుంటే చర్చలకు సిద్ధమే[01:26]
  • ప్రకటనల్లో వార్తాపత్రికలకు సరైన వాటా ఇవ్వండి![19:55]
  • రేపు భారత్‌ బంద్‌[19:09]
  • సామాన్యుడిపై మరో పిడుగు: ఇక పాల వంతు?  [17:32]
  • ‘విభజించి.. పాలించడం’ కాంగ్రెస్‌ విధానం: మోదీ  [15:32]
  • కడు పేదలు ఇక్కడ లేరు..![14:58]
  • తమిళనాడులో 9,10,11 తరగతుల పరీక్షలు రద్దు[14:08]
  • అమెరికాలో వీసా బ్యాన్‌ ఉపసంహరణ..!  [12:46]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • సుకుమార్‌ ఫ్యామిలీ ఫంక్షన్‌లో తారల సందడి
  • ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేం: మోదీ
  • పాత్రలో లీనం.. నాటకంలో హత్యాయత్నం
  • అమ్మ స్తనంపై పాముకాటు
  • ప్రేమ తీసిన ప్రాణం
  • ప్రియురాలు.. ప్రియుడు.. ఓ బాధితుడు
  • అంపైర్‌ నిర్ణయాలతో అసహనం..!
  • అమెజాన్‌ ప్రైమ్‌ రూ.20 మాత్రమే!
  • ఒకే హాస్టల్‌లో 190 మందికి కరోనా!
  • బస్సు చక్రాల కింద నలిగి గర్భిణి దుర్మరణం
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.