☰
శనివారం, జనవరి 16, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • రయ్‌.. రయ్‌
  • సిరి
  • ఈ తరం
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • టెక్ కబుర్లు ‌
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 23/11/2020 00:49 IST
బైడెన్‌ను అధ్యక్షుడిగా గుర్తించను: పుతిన్‌

మాస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఎట్టకేలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పందించారు. ఎవరి నాయకత్వంలోనైనా అమెరికాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కానీ, అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ గెలుపును మాత్రం గుర్తించేందుకు సిద్ధంగా లేనని పుతిన్‌ స్పష్టంచేశారు. ‘అమెరికా ప్రజల నమ్మకాన్ని కలిగిన ఏ నాయకుడితోనైనా మేము కలిసి పనిచేస్తాం. అయితే, ఆ విశ్వాసాన్ని ప్రతిపక్ష పార్టీ గుర్తించిన అభ్యర్థి లేదా చట్టపరమైన మార్గంలో ఫలితాలు నిర్ధారించబడిన తర్వాతే పొందుతారు’ అని రష్యన్‌ అధికారిక మీడియాలో పుతిన్‌ వెల్లడించారు. బైడెన్‌ను అభినందించకూడదని క్రెమ్లిన్‌ నిర్ణయం తీసుకుందని.. వీటిలో ఎలాంటి ఉద్దేశాలు లేవని పుతిన్‌ వివరణ ఇచ్చారు. అయితే, ఈ చర్య అమెరికా-రష్యా సంబంధాలను దెబ్బతీస్తుందా? అన్న ప్రశ్నకు బదులుగా.. ‘దెబ్బతినడానికి ఏమీ లేవు, అవి ఇప్పటికే పూర్తిగా క్షీణించిపోయాయి’ అని పుతిన్‌ సమాధానమిచ్చారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ప్రపంచ దేశాధినేతలు బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కేవలం, రష్యా, చైనా వంటి దేశాలు మాత్రమే ఆచితూచి స్పందించాయి. చివరకు చైనా కూడా బైడెన్ ఎన్నికపై శుభాకాంక్షలు తెలిపింది. కానీ, పుతిన్‌ మాత్రం అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ను గుర్తించేందుకు సిద్ధంగా లేనని తాజాగా ప్రకటించారు.

ఇదిలాఉంటే, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకుంటూ.. ట్రంప్‌నకు సాయం చేసారని రష్యాపై అమెరికా ఇంటెలిజెన్స్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి రష్యా కాస్త జాగ్రత్తపడింది. అందుకే బైడెన్‌ ఎన్నికపై ఆచితూచి స్పందిస్తోంది.

Tags: AmericaElectionsJoe BidenVladimir PutinRussiaఅమెరికాజో బైడెన్‌వ్లాదిమిర్‌ పుతిన్‌రష్యా 

మరిన్ని

  • ఎవరూ అనారోగ్యానికి గురికాలేదు: కేంద్రం   [20:31]
  • 2020లో దేశీయ విమాన ప్రయాణికులు@ 6.3 కోట్లు[18:42]
  • టీకా వేయించుకున్న తొలి పొలిటీషియన్లు వీరే..!  [18:32]
  • బ్రిటన్‌ రకం: భారత్‌లో 116కు చేరిన కేసులు[17:59]
  • భారత్‌లో టీకా పంపిణీ..ప్రపంచానికి పాఠాలు![15:59]
  • కొవిడ్‌ టీకాలు: కరోనా పోరులో ‘సంజీవని’లు![14:22]
  • టీకా వేయించుకున్న సీరమ్‌ అధినేత[13:49]
  • బైడెన్‌ ప్రమాణం వేళ..[13:01]
  • భారత్..ఏడాదిలోపే అందుబాటులోకి టీకా..![12:36]
  • కన్నీటి పర్యంతమైన మోదీ[12:14]
  • ‘పేషెంట్‌ జీరో’ను ఎప్పటికీ కనుక్కోలేము..![11:32]
  • అందుకే చైనాపై మా అనుమానాలు: పాంపియో[11:18]
  • అతిపెద్ద వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం[10:31]
  • భారత్‌: 96.56 శాతానికి పెరిగిన రికవరీ..[10:12]
  • 20లక్షలు దాటిన కరోనా మరణాలు![09:51]
  • ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’[00:44]
  • కేంద్రం × రైతులు: తొమ్మిదో‘సారీ’  [00:33]
  • 75 డ్రోన్లు విరుచుకుపడి..![00:28]
  • రామమందిరానికి వజ్రాల వ్యాపారుల భారీ విరాళాలు[00:23]
  • చైనాను తిప్పికొట్టి ధైర్యం నింపారు: రాజ్‌నాథ్‌[20:16]
  • వంద రోజుల్లో.. 10కోట్ల మందికి టీకా: బైడెన్‌[17:17]
  • టీకాపై వదంతులు నమ్మొద్దు: కేజ్రీవాల్‌[14:56]
  • కమలా హారిస్‌ను అభినందించిన పెన్స్‌..![13:26]
  • టీకా తీసుకున్న ఎయిమ్స్‌ డైరెక్టర్‌![12:46]
  • తూటాల జడివాన మధ్య మానవత్వం[11:44]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
  • ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
  • క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
  • కన్నీటి పర్యంతమైన మోదీ
  • రోహిత్‌ను సరదాగా ట్రోల్‌ చేసిన డీకే
  • పశ్చాత్తాపం లేదు.. అలానే ఆడతా: రోహిత్‌
  • సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ 
  • చరిత్ర సృష్టించిన నయా యార్కర్‌ కింగ్‌
  • కంగారూను పట్టలేక..
  • ప్రధాని సూచన మేరకే ఆ నిర్ణయం: కేటీఆర్‌
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.