శుక్రవారం, మే 29, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

మహిళా సిబ్బంది వద్దు

తబ్లిగి సభ్యులపై జాతీయ భద్రతా చట్టం

లఖ్‌నవూ: తబ్లిగి జమాత్‌ సభ్యులకు సంబంధించిన విధుల్లో మహిళా సిబ్బంది నియమించవద్దని ఉత్తర్‌ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఘజియాబాద్ ఎంఎంజె జిల్లా ఆస్పత్రిలోని క్వారంటైన్‌ వార్డ్‌లో అసభ్యకర ప్రవర్తనకు గానూ ఆరుగురు తబ్లిగి సభ్యులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తబ్లిగి జమాత్‌ సభ్యులకు భద్రత కల్పించటం కోసం లేదా వైద్య సేవలు అందించటం కోసం మహిళలను నియమించవద్దని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులనిచ్చింది. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ వారిని మానవత్వానికే శత్రువులుగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ ఆరుగురిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) ప్రకారం చర్యలు తీసుకోనున్నామని ఆయన వివరించారు. ఇండోర్‌ తరహా ఘటనలు మరల పునరావృతం కారాదని...అందుకు చట్టపరంగా తాము చర్యలు చేపడతామని ఆదిత్యనాథ్‌ తెలిపారు. 

Tags:
కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)