సోమవారం, జులై 13, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

జార్జ్‌ ఫ్లాయిడ్‌ది నరహత్యే..!

వెలువడిన శవపరీక్ష అధికారిక నివేదిక

వాషింగ్టన్‌: ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్ ఫ్లాయిడ్‌ (46) మృతికి నిరసనగా అగ్రరాజ్యంలో ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్న వేళ అధికారిక శవపరీక్ష నివేదిక విడుదలైంది. మెడపై తీవ్రమైన ఒత్తిడి వల్లే ఆయన మరణించాడని వైద్యులు తేల్చారు. జార్జ్‌ మరణించిన తీరును బట్టి దీన్ని నరహత్యగా పేర్కొనవచ్చని మెడికల్‌ ఎగ్జామినర్‌ అభిప్రాయపడ్డారు. మెడను బలంగా నొక్కిపెట్టడం వల్ల గుండె ఆగి జార్జ్‌ మరణించినట్లు స్పష్టం చేశారు. అప్పటికే ఆయన గుండె సంబంధిత, హైపర్‌టెన్షన్‌ వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. పైగా ఇటీవల ‘ఫెంటనిల్‌’ ఇన్‌టాక్సికేషన్‌, ‘మెథమ్‌ఫెటమైన్‌’ అనే డ్రగ్స్‌ కూడా తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. 

అటు జార్జ్‌ కుటుంబం కోసం ఏర్పాటు చేసిన వైద్యుల బృందం కూడా ఆయనది హత్యగానే తేల్చింది. ఊపిరాడకపోవడం వల్లే జార్జ్‌ మరణించాడని పేర్కొంది. మెడపై ఒత్తిడి వల్ల మెదడుకు రక్తప్రసరణ సైతం ఆగిపోయిందని తెలిపింది. అలాగే అతని వెనుక భాగంపై ఇతర పోలీసు అధికారులు అధిమి పట్టడం వల్ల ఆ సమయంలో ఊపిరి తీసుకోవడం జార్జ్‌కి కష్టంగా మారిందని నివేదికలో పేర్కొన్నట్లు ఫ్లాయిడ్ కుటుంబానికి చెందిన న్యాయవాది బెంజమిన్ క్రంప్ విలేకరుల సమావేశంలో తెలిపారు. కుటుంబం తరఫున మైఖేల్‌ బాడెన్‌, అలేషియా విల్సన్ అనే వైద్యులతో కూడిన బృందం శవపరీక్ష నిర్వహించింది. బాడెన్‌ గతంలో న్యూయార్క్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. అలాగే 2014లో పోలీసుల చేతిలో మరణించిన మరో నల్లజాతీయుడు ఎరిక్‌ గార్నర్‌ శవపరీక్ష సైతం బాడెనే చేశారు.

కుటుంబం తరఫున జరిపిన శవపరీక్ష నివేదికతో పోలిస్తే అధికారిక నివేదిక భిన్నంగా ఉండడం గమనార్హం. అధికారిక నివేదికలో ఎక్కడా ఫ్లాయిడ్‌ ఊపిరాడకపోవడం వల్ల మరణించినట్లు పేర్కొనలేదు. పైగా అతడు అప్పటికే గుండె ఇతర సమస్యల వల్ల బాధపడుతున్నట్లు, డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు పేర్కొనగా.. కుటుంబ నివేదికలో మాత్రం అవేవీ లేకపోవడం గమనార్హం. మరణించిన సమయంలో జార్జ్‌ ఆరోగ్యంగానే ఉన్నాడని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని